Telugu Global
NEWS

రాజ్యసభలో హోరెత్తిన ప్రత్యేక హోదా నినాదాలు..

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మరోసారి ఏపీ ప్రత్యేక హోదా అంశం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. వైసీపీ ఎంపీలు ఏకంగా వెల్ లోకి వెళ్లి ఆందోళన చేపట్టారు. తక్షణం ఏపీ ప్రత్యేక హోదా అంశంపై చర్చ జరపాలన్నారు. రూల్ 267కింద, మిగతా అంశాలన్నీ పక్కనపెట్టి అత్యంత ప్రాధాన్యతా అంశం కింద ప్రత్యేక హోదాపై చర్చించాలని డిమాండ్ చేశారు. దీనిపై రాజ్యసభచైర్మన్ వెంకయ్య నాయుడు స్పందించారు. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై చర్చ చేపడతామని, వైసీపీ ఇచ్చిన నోటీసుకి స్పందిస్తామని […]

రాజ్యసభలో హోరెత్తిన ప్రత్యేక హోదా నినాదాలు..
X

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మరోసారి ఏపీ ప్రత్యేక హోదా అంశం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. వైసీపీ ఎంపీలు ఏకంగా వెల్ లోకి వెళ్లి ఆందోళన చేపట్టారు. తక్షణం ఏపీ ప్రత్యేక హోదా అంశంపై చర్చ జరపాలన్నారు. రూల్ 267కింద, మిగతా అంశాలన్నీ పక్కనపెట్టి అత్యంత ప్రాధాన్యతా అంశం కింద ప్రత్యేక హోదాపై చర్చించాలని డిమాండ్ చేశారు. దీనిపై రాజ్యసభచైర్మన్ వెంకయ్య నాయుడు స్పందించారు. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై చర్చ చేపడతామని, వైసీపీ ఇచ్చిన నోటీసుకి స్పందిస్తామని చెప్పారు. ఇతర అంశాలతోపాటు ప్రత్యేక హోదాపై చర్చ జరిపేందుకు సమయం కేటాయిస్తామని అన్నారు, వెల్ లోకి వచ్చి ఆందోళన చేయొద్దని, వెనక్కి వెళ్లిపోవాలని వైసీపీ ఎంపీలకు సూచించారు.

సభ సమావేశానికి ముందు రాజ్య సభ చైర్మన్ కు వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా అంశంపై చర్చకు నోటీసు ఇచ్చారు. సభా నియమ నిబంధనలలోని రూల్‌ 267 కింద ఎంపీ విజయసాయిరెడ్డి ఈ నోటీసు ఇచ్చారు. రాజ్యసభలో ఈరోజు నిర్వహించే ఇతర వ్యవహారాలన్నింటిని పక్కన పెట్టి రూల్‌ 267 కింద ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చను ప్రారంభించాలని ఆయన నోటీసులో కోరారు.

ఏపీ ప్రత్యేక హోదా అంశం అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశమని నోటీసులో వివరించారు విజయసాయిరెడ్డి. రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి విభజిత ఆంధ్రప్రదేశ్‌ కు పలు హామీలు ప్రకటించారని అందులో ప్రత్యేక హోదా అతి ప్రధానమైనదని గుర్తు చేశారు. ప్రధానమంత్రి ఇచ్చిన హామీపై 2014 మార్చి-1న జరిగిన కేంద్ర మంత్రిమండలిలో చర్చ జరిగిందని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి నాటి మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. కానీ ఏళ్లు గడిచినా ఈ హామీ అమలుకు నోచుకోలేదని అన్నారు. సభా కార్యక్రమాలన్నింటినీ సస్పెండ్‌ చేసి తక్షణమే ఏపీ ప్రత్యేక హోదా అంశంపై చర్చించాలని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు.

First Published:  19 July 2021 4:15 AM GMT
Next Story