Telugu Global
International

మంకీ బీ వైరస్ తెలుసా?

ప్రస్తుతం చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. కోతుల నుంచి వచ్చే మంకీ బీ అనే వైరస్ తో చైనాలోని ఓ పశువుల వైద్యుడు కన్నుమూశాడు. దీంతో ఈ వైరస్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. మనుషుల్లో తొలి మంకీ బీ వైరస్ కేసు చైనాలో నమోదైనట్టు చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వెల్లడించింది. చైనాలోని బీజింగ్ లో ఓ పశువైద్యుడు వికారం వాంతులు లాంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఎలాంటి ఉపయోగం […]

మంకీ బీ వైరస్ తెలుసా?
X

ప్రస్తుతం చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. కోతుల నుంచి వచ్చే మంకీ బీ అనే వైరస్ తో చైనాలోని ఓ పశువుల వైద్యుడు కన్నుమూశాడు. దీంతో ఈ వైరస్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది.
మనుషుల్లో తొలి మంకీ బీ వైరస్ కేసు చైనాలో నమోదైనట్టు చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వెల్లడించింది. చైనాలోని బీజింగ్ లో ఓ పశువైద్యుడు వికారం వాంతులు లాంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఎలాంటి ఉపయోగం లేదు. చివరికి అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించి, మే 27న ప్రాణాలు కోల్పోయాడు. అయితే అతను చనిపోయిన తర్వాత ఆయన మృతదేహాన్ని పరీక్షించగా మంకీ బీ వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. అతను తన పరిశోధనలో భాగంగా మార్చి నెలలో రెండు చనిపోయిన కోతుల శరీరాలను ముక్కలుగా చేసి పరీక్షించాడు. ఆ తర్వాతే అతని ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. అలా మంకీ బీ వైరస్ ఇప్పుడు తెరపైకి వచ్చింది.

బీవీ గా పిలిచే మంకీ బీ వైరస్‌ను 1932లోనే గుర్తించారు. మకాక్స్‌ అనే కోతి జాతిలో ఇది కనిపించింది. ఇది కోతుల నుంచి శరీర ద్రవాల ద్వారా నేరుగా మనుషులకు సంక్రమిస్తుంది. ఈ వైరస్‌ అత్యంత ప్రమాదం. ఈ వైరస్ సొకితే మరణించే పాజిబిలిటీ 70 నుంచి 80 శాతం వరకూ ఉంటుంది. అంటే వంద మందిలో కేవలం 20 మంది మాత్రమే బ్రతికుండే అవకాశం ఉంది. అందుకే ఈ సందర్భంగా కోతుల సంరక్షణ చూసే వ్యక్తులు, జూ అధికారులు, కోతులకు దగ్గరగా నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

First Published:  19 July 2021 5:03 AM GMT
Next Story