Telugu Global
National

ప్రభుత్వాలనే హ్యాక్ చేస్తున్నారు

అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తుంటాం. కొంతమంది హ్యాకర్లు ఏకంగా ప్రభుత్వాన్నే హ్యాక్ చేసి దేశాన్ని బెదిరిస్తుంటారు. అయితే అచ్చం ఇలాంటి ఇష్యూ ఒకటి రీసెంట్ గా బయటకొచ్చింది. కేవలంప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉండే ‘పెగాసస్‌’ అనే స్పైవేర్ హ్యాకింగ్‌కు గురైందన్న వార్తలు కలవరపెడుతున్నాయి. ప్రభుత్వ స్పైవేర్ ను హ్యాక్ చేసి పలువురు కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లను హ్యాకర్లు హ్యాకింగ్‌ చేసినట్టు తాజాగా కొన్ని కథనాలు వస్తున్నాయి. అసలు ఈ పెగాసస్ కథ ఏంటంటే.. పెగాసస్ అనే […]

ప్రభుత్వాలనే హ్యాక్ చేస్తున్నారు
X

అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తుంటాం. కొంతమంది హ్యాకర్లు ఏకంగా ప్రభుత్వాన్నే హ్యాక్ చేసి దేశాన్ని బెదిరిస్తుంటారు. అయితే అచ్చం ఇలాంటి ఇష్యూ ఒకటి రీసెంట్ గా బయటకొచ్చింది. కేవలంప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉండే ‘పెగాసస్‌’ అనే స్పైవేర్ హ్యాకింగ్‌కు గురైందన్న వార్తలు కలవరపెడుతున్నాయి.

ప్రభుత్వ స్పైవేర్ ను హ్యాక్ చేసి పలువురు కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లను హ్యాకర్లు హ్యాకింగ్‌ చేసినట్టు తాజాగా కొన్ని కథనాలు వస్తున్నాయి. అసలు ఈ పెగాసస్ కథ ఏంటంటే..
పెగాసస్ అనే స్పై వేర్ ను ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ డెవలప్ చేసింది. ఈ స్పైవేర్ ను ప్రభుత్వ ఆధీన సంస్థలకు మాత్రమే విక్రయిస్తారు. ఉగ్రవాదులను పట్టుకోడానికి, దేశ భద్రత కోసం, నిఘా వర్గాల కోసం ఈ స్పైవేర్ ను వాడుతుంటారు. దీనిని హ్యాక్ చేయడం అంత ఈజీకాదు. ఒకవేళ చేస్తే.. దేశానికి సంబంధించిన కీలకమైన సమాచారమంతా లీక్ అవుతుంది.

అయితే గతంలో కొన్ని సార్లు ఈ స్పైవేర్ హ్యాక్ అయినట్టు కొన్ని వార్తలొచ్చాయి. మళ్లీ ఇప్పుడు తాజాగా ఈ పెగాసస్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ స్పైవేర్‌తో హ్యాకింగ్‌కు గురైన వారి డేటాబేస్‌ ఒకటి లీకైంది.
ఫ్రాన్స్‌కు చెందిన ఫోర్‌బిడెన్‌ స్టోరీస్‌.. ఈ హ్యాకింగ్ పై దర్యాప్తు జరిపి ‘ది పెగాసస్’ పేరుతో ఒక రిపోర్ట్ విడుదల చేసింది. దాన్ని పలు అంతర్జాతీయ పత్రికలు ప్రచురించాయి.

ఈ డేటాబేస్ లో దాదాపు 50 దేశాలకు చెందిన వ్యక్తుల ఫోన్ నంబర్లు,189 మంది జర్నలిస్టులు, 600మందికి పైగా రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, 65 మంది బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు, కొంతమంది మానవహక్కుల కార్యకర్తలు ఉన్నారు. అందులో భారత్‌ నుంచి 300మందికి పైగా బాధితులుండగా.. సౌదీ అరేబియా, బహ్రెయిన్‌, హంగేరి, మెక్సికో, మొరాకో దేశాలకు చెందిన ప్రముఖులు కూడా ఇందులో ఉన్నారు.

ఇలా పని చేస్తుంది
పెగాసస్ స్పైవేర్‌ ను మొబైల్ లోకి వెబ్ లింక్ ద్వారా పంపిస్తారు. అంటే ఏదైనా నకిలీ లింక్ క్లిక్ చేసినప్పుడు మనకు తెలియకుండానే ఇది మన మొబైల్ లో ఇన్ స్టాల్ అవుతుంది. ఆ తర్వాత ఫోన్ లో మనం చేసే యాక్టివిటీస్ అన్నీ హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతాయి. అలా మన ఫోన్ పై నిఘా పెట్టడం, వాట్సాప్‌ ఎన్‌క్రిప్టెడ్‌ సందేశాలను చదవడం, కాల్స్‌ను, లొకేషన్ ను యూజర్లు మాట్లాడే కాల్స్‌ను రికార్డ్‌ చేయడం లాంటివి చేస్తుంది. వాస్తవానికి ప్రభుత్వాలు ఎవరిపైనైనా నిఘా పెట్టాలనుకున్నప్పుడు ఈ స్పైవేర్‌ను ఉపయోగిస్తుంటాయి. అలాంటిది ఇది హ్యాక్ అయ్యి ప్రభుత్వాలపై నిఘా పెడుతూ హ్యాకర్లకు ఇన్ఫర్మేషన్ అందిస్తే అది దేశ భద్రతకు ముప్పుగా మారొచ్చు. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలన్ని మరోసారి దీన్ని సీరియస్ గా తీసుకున్నాయి.

First Published:  19 July 2021 4:06 AM GMT
Next Story