Telugu Global
NEWS

ఈసారి ఛాన్స్ ఇవ్వం.. రేవంత్ గృహనిర్బంధం..

ఇటీవల పెట్రోలు ధరల పెంపున‌కు నిరసనగా రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించి కాంగ్రెస్ నేతలు అలజడి సృష్టించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కాస్త గట్టిగానే ఆందోళన చేపట్టింది. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ రెండు పార్టీలను తీవ్రంగా విమర్శించింది. అరెస్ట్ ల పర్వంతో ఈ ఆందోళనను అడ్డుకున్నా.. మీడియా, సోషల్ మీడియాలో కాంగ్రెస్ హడావిడి బాగా హైలెట్ అయింది. అదే రీతిలో ఇప్పుడు కోకాపేట భూముల వేలం విషయంలో కూడా రేవంత్ రెడ్డి […]

ఈసారి ఛాన్స్ ఇవ్వం.. రేవంత్ గృహనిర్బంధం..
X

ఇటీవల పెట్రోలు ధరల పెంపున‌కు నిరసనగా రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించి కాంగ్రెస్ నేతలు అలజడి సృష్టించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కాస్త గట్టిగానే ఆందోళన చేపట్టింది. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ రెండు పార్టీలను తీవ్రంగా విమర్శించింది. అరెస్ట్ ల పర్వంతో ఈ ఆందోళనను అడ్డుకున్నా.. మీడియా, సోషల్ మీడియాలో కాంగ్రెస్ హడావిడి బాగా హైలెట్ అయింది. అదే రీతిలో ఇప్పుడు కోకాపేట భూముల వేలం విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు సిద్ధపడ్డారు. చలో కోకాపేట పేరుతో భూముల సందర్శనకు బయలుదేరాలని నిర్ణయించారు నేతలు. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం అలర్ట్ అయింది. వారందర్నీ గృహనిర్బంధంలో పెట్టింది.

తెల్ల‌వారుజామున మూడు గంట‌ల నుంచే జూబ్లీహిల్స్ లో టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వ‌ద్ద పోలీసులు మ‌కాం వేశారు. బ‌య‌ట‌కు రాకుండా గృహ‌నిర్బంధం చేశారు. భూముల సంద‌ర్శ‌న‌కు పీసీసీ ఎన్నిక‌ల నిర్వహ‌ణ క‌మిటీ ఛైర్మ‌న్ దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌, జ‌గ్గారెడ్డి, మ‌హేష్‌ కుమార్ గౌడ్ త‌దిత‌రులు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతుండగా వారిని కూడా పోలీసులు అడ్డుకున్నారు.

రేవంత్ దూకుడుకి టీఆర్ఎస్ ఎడ్డుకట్ట వేయగలదా..?
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయినప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అప్పటి వరకూ బీజేపీతో సతమతం అవుతున్న అధికార టీఆర్ఎస్ కి రేవంత్ రూపంలో కొత్త ముప్పు ఎదురయ్యే ప్రమాదం ఉందని తేలిపోయింది. అదేమైనా ప్రధాని పదవా, పీసీసీ పదవికి అంత రాద్ధాంతమెందుకంటూ కేటీఆర్ వంటి నేతలు ఎద్దేవా చేస్తూనే.. మరోవైపు రేవంత్ రెడ్డికి అడ్డుకట్ట వేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. రేవంత్ ని ఇల్లు దాటనీయకుండా అడ్డుకుంటున్నారు.

First Published:  18 July 2021 11:19 PM GMT
Next Story