Telugu Global
Cinema & Entertainment

కేజీఎఫ్ బాటలో ఆది సాయికుమార్

యష్ హీరోగా తెరకెక్కిన సినిమా కేజీఎఫ్. దేశవ్యాప్తంగా సూపర్ హిట్టయింది ఈ సినిమా. ముందు ఛాప్టర్-1 రిలీజైంది. ఇప్పుడు ఛాప్టర్-2 విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ కూడా ఇదే బాటలో నడుస్తున్నాడు. తన కొత్త సినిమాకు సంబంధించి ఛాప్టర్-1 ప్రకటించాడు ఈ హీరో. ‘లవ్ లీ’ స్టార్ ఆది సాయికుమార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1’. ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మాత […]

కేజీఎఫ్ బాటలో ఆది సాయికుమార్
X

యష్ హీరోగా తెరకెక్కిన సినిమా కేజీఎఫ్. దేశవ్యాప్తంగా సూపర్ హిట్టయింది ఈ సినిమా. ముందు ఛాప్టర్-1
రిలీజైంది. ఇప్పుడు ఛాప్టర్-2 విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ కూడా
ఇదే బాటలో నడుస్తున్నాడు. తన కొత్త సినిమాకు సంబంధించి ఛాప్టర్-1 ప్రకటించాడు ఈ హీరో.

‘లవ్ లీ’ స్టార్ ఆది సాయికుమార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ‘అమరన్‌ ఇన్‌ ది
సిటీ-చాప్టర్‌ 1’. ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మాత ఎస్ వీ ఆర్ నిర్మిస్తున్నారు. ఆది పవర్ ఫుల్ పోలీస్
ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు
రాని కొత్త కథతో ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1’ సినిమాను రూపొందిస్తున్నారు డెబ్యూ డైరెక్టర్ ఎస్
బాలవీర్.

రెండేళ్ల పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి పక్కా ప్లానింగ్ తో షూటింగ్ కు రెడీ అయ్యింది ‘అమరన్‌ ఇన్‌
ది సిటీ-చాప్టర్‌ 1’ సినిమా. ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల
హైదరాబాద్ లో ప్రారంభమైంది.

ఈ ఫస్ట్ షెడ్యూల్ లో భారీ ఖర్చుతో నిర్మించిన పోలీస్ సెట్ లో షూటింగ్ చేస్తున్నారు. దీంతో పాటు నగర
పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు. ఆది సాయి కుమార్ సరికొత్త లుక్ లో
కనిపించనున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఉండబోతోంది.

First Published:  18 July 2021 6:16 AM GMT
Next Story