Telugu Global
NEWS

టీటీడీ చైర్మన్​గా వైవీ సుబ్బారెడ్డి కొనసాగింపు..!

ఇవాళ ఏపీ ప్రభుత్వం నామినేటెడ్​ పదవులను భర్తీ చేసింది. పలు కార్పొరేషన్​లకు చైర్మన్లు, డైరెక్టర్లను నియమించింది. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మేరకు మీడియాకు వివరాలు వెల్లడించారు. అయితే ఈసారి జోడు పదవుల విధానానికి ఏపీ ప్రభుత్వం స్వస్తి పలికింది. మరోవైపు నామినేటెడ్​ పదవుల్లో సామాజిక సమీకరణాలు పాటించారు. ముఖ్యంగా స్త్రీలకు పెద్దపీట వేశారు. ఇదిలా ఉంటే టీటీడీ చైర్మన్​గా వైవీ సుబ్బారెడ్డిని కొనసాగించారు. వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియడంతో.. ఆయనను రాజ్యసభకు పంపిస్తారని […]

టీటీడీ చైర్మన్​గా వైవీ సుబ్బారెడ్డి కొనసాగింపు..!
X

ఇవాళ ఏపీ ప్రభుత్వం నామినేటెడ్​ పదవులను భర్తీ చేసింది. పలు కార్పొరేషన్​లకు చైర్మన్లు, డైరెక్టర్లను నియమించింది. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మేరకు మీడియాకు వివరాలు వెల్లడించారు. అయితే ఈసారి జోడు పదవుల విధానానికి ఏపీ ప్రభుత్వం స్వస్తి పలికింది. మరోవైపు నామినేటెడ్​ పదవుల్లో సామాజిక సమీకరణాలు పాటించారు. ముఖ్యంగా స్త్రీలకు పెద్దపీట వేశారు. ఇదిలా ఉంటే టీటీడీ చైర్మన్​గా వైవీ సుబ్బారెడ్డిని కొనసాగించారు.

వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియడంతో.. ఆయనను రాజ్యసభకు పంపిస్తారని వార్తలు వచ్చాయి. ఆయన మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్​ కాబోతున్నారని కూడా ఊహాగానాలు వినిపించాయి. కానీ ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది. మొత్తం 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పోస్టులను ప్రభుత్వం కేటాయించింది.

రోజాకు నిరాశ..!
ఏపీఐఐసీ చైర్మన్​ గా మెట్టు గోవిందరెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు నగరి ఎమ్మెల్యే రోజా ఈ పదవిలో కొనసాగిన విషయం తెలిసిందే. జోడు పదవులు ఇవ్వొద్దన్న నిబంధనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో ఎమ్మెల్యే రోజాకు నిరాశే ఎదురైంది. జగన్​ అధికారంలోకి వచ్చాక.. ఆమెకు మంత్రి పదవి వస్తుందని అంతా ఆశించారు. కానీ అనూహ్యంగా ఆమెకు పదవి దక్కలేదు. దీంతో రోజా కినుక వహించారు.

వైసీపీ అధిష్ఠానం ఆమెకు ఏపీఐఐసీ పదవిని కట్టబెట్టింది. ప్రస్తుతం ఆ పదవి నుంచి కూడా తప్పించారు. అయితే రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ ఉంటుందని.. 80 శాతం మందిని తప్పించి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తామని సీఎం జగన్​ గతంలో ప్రకటించారు. అయితే ఆ ప్రాతిపదికన అయినా రోజాకు మంత్రి పదవి దక్కుతుందేమో వేచి చూడాలి.

బైరెడ్డికి కీలక పదవి..!
నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన యువనేత బైరెడ్డి సిద్ధార్థ్​రెడ్డి.. ఆకట్టుకొనే ప్రసంగాలతో ఫేమస్​ అయ్యారు. నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్​డ్​ స్థానం కావడంతో అక్కడ ఆర్థర్​ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయనకు ఏదో ఒక నామినేటెడ్​ పదవి దక్కుతుందని చర్చ నడుస్తోంది. తాజాగా ఆయనకు ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌ పదవి దక్కింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపునకు బైరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత అక్కడి ఎమ్మెల్యే ఆర్థర్​కు బైరెడ్డితో విబేధాలు వచ్చినట్టు కూడా వార్తలు వచ్చాయి.

First Published:  17 July 2021 8:16 AM GMT
Next Story