Telugu Global
Others

ఫైబర్ తింటున్నారా?

మనం తీసుకునే ఆహారంలో అన్ని న్యూట్రియెంట్స్ సరైన పాళ్లలో ఉంటేనే పూర్తి ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కానీ మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఫైబర్ అనేది చాలామందిలో లోపిస్తున్నట్టు కొన్ని స్టడీల ద్వారా తేలింది. ఫైబర్ సాధారణ జీర్ణక్రియను నిర్వహించడానికే కాకుండా శరీరం పోషకాలను గ్రహించడానికి కూడా సాయపడుతుంది. శరీరంలో ఫైబర్ ఎలా ఉపయోగపడుతుందంటే.. డైటరీ ఫైబర్ అనేది ఒక రకమైన కార్బోహైడ్రేట్. ఇది పోషకాలను గ్రహించడానికి అవసరం. ఇది తక్కువ మొత్తంలో ఎక్కువ శక్తిని అందిస్తుంది. మెల్లగా […]

ఫైబర్ తింటున్నారా?
X

మనం తీసుకునే ఆహారంలో అన్ని న్యూట్రియెంట్స్ సరైన పాళ్లలో ఉంటేనే పూర్తి ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కానీ మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఫైబర్ అనేది చాలామందిలో లోపిస్తున్నట్టు కొన్ని స్టడీల ద్వారా తేలింది. ఫైబర్ సాధారణ జీర్ణక్రియను నిర్వహించడానికే కాకుండా శరీరం పోషకాలను గ్రహించడానికి కూడా సాయపడుతుంది. శరీరంలో ఫైబర్ ఎలా ఉపయోగపడుతుందంటే..

డైటరీ ఫైబర్ అనేది ఒక రకమైన కార్బోహైడ్రేట్. ఇది పోషకాలను గ్రహించడానికి అవసరం. ఇది తక్కువ మొత్తంలో ఎక్కువ శక్తిని అందిస్తుంది. మెల్లగా శక్తిని విడుదల చేస్తూ ఎక్కువ సేపు శరీరంలో ఉంటుంది. ఆపిల్, బీన్స్, ఓట్స్, సిట్రస్ ఫ్రూట్స్ వంటి ఆహారాలలో డైటరీ ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. గోధుమలు, కాలీఫ్లవర్, గ్రీన్ బీన్స్ వంటి కూరగాయలలో నాన్ డైటరీ ఫైబర్స్ ఉంటాయి. ఇది రోజువారీ ఆహారంగానూ, సమతుల్యమైన ఆహారంగానూ పనికొస్తుంది.

డైటరీ ఫైబర్ స్పాంజి లాంటిది! ఇది నీటిని పట్టుకుని ఉంచగలదు. దీనికున్న ఈ క్వాలిటీ కారణంగా ఫైబర్ ప్రేగులలో ఈజీగా అరగడానికి, పొట్టలో గ్యాస్ ను ఖాళీ చేయడానికి సాయపడుతుంది. జీర్ణక్రియ సరిగ్గా ఉండాలంటే రోజువారీ ఆహారంలో ఫైబర్, తగినంత నీరు ఉంటే చాలు. ఎలాంటి అజీర్ణ సమస్యలు లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

మన భారతీయ ఆహారంలో సాధారణంగానే గోధుమలు, బార్లీ, రాగి వంటి తృణధాన్యాలు ఉంటాయి. ఇవన్నీ సహజమైన ఫైబర్ల కిందికే వస్తాయి. ఇవి కాకుండా క్యారెట్లు, దుంపలు, క్యాబేజీ, బఠానీలు, బ్రోకొలీ, బీన్స్, ఆపిల్, నారింజ, జామ, బాదం, ఎండుద్రాక్ష, వేరుశనగ, అవిసె గింజల ద్వారా కూడా మంచి ఫైబర్స్ లభిస్తాయి.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం రోజుకి 40 గ్రాముల డైటరీ ఫైబర్ తీసుకోవడం ఉత్తమం అలాగే సురక్షితం. కాబట్టి రోజువారీ డైట్ లో జంక్ ఫుడ్ ను తగ్గించి ఫైబర్ ను యాడ్ చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. తక్కువ మొత్తంతో, పూర్తి శక్తిని, ఆరోగ్యాన్ని అందించే ఫైబర్ నిజంగా సూపర్ ఫుడ్ లాగా పనిచేస్తుంది.

First Published:  17 July 2021 4:22 AM GMT
Next Story