Telugu Global
NEWS

మహిళలు రాజకీయాలు చేయొద్దా? కేటీఆర్​ స్త్రీలకు ఇచ్చే గౌరవం ఇదేనా?

మహిళలు రాజకీయాలు చేయొద్దా అంటూ వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల ప్రశ్నించారు. ఇటీవల తనపై ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ‘టీఆర్​ఎస్​ పార్టీలో మహిళలకు గౌరవం లేదు. పక్క పార్టీల నుంచి మహిళా ప్రజాప్రతినిధులను తెచ్చుకొని మంత్రులను చేశారు. ఆ పార్టీ నిర్వహించే సమావేశాల్లో కనీసం మహిళలకు ఓ కుర్చీ అయినా వేస్తారా? ’ అంటూ షర్మిల మండిపడ్డారు. మహిళలు వారం వారం వ్రతం చేసినట్టుగానే షర్మిల దీక్షలు చేస్తున్నారంటూ […]

మహిళలు రాజకీయాలు చేయొద్దా? కేటీఆర్​ స్త్రీలకు ఇచ్చే గౌరవం ఇదేనా?
X

మహిళలు రాజకీయాలు చేయొద్దా అంటూ వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల ప్రశ్నించారు. ఇటీవల తనపై ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ‘టీఆర్​ఎస్​ పార్టీలో మహిళలకు గౌరవం లేదు. పక్క పార్టీల నుంచి మహిళా ప్రజాప్రతినిధులను తెచ్చుకొని మంత్రులను చేశారు. ఆ పార్టీ నిర్వహించే సమావేశాల్లో కనీసం మహిళలకు ఓ కుర్చీ అయినా వేస్తారా? ’ అంటూ షర్మిల మండిపడ్డారు.

మహిళలు వారం వారం వ్రతం చేసినట్టుగానే షర్మిల దీక్షలు చేస్తున్నారంటూ కేటీఆర్​ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్​ ఇచ్చారు. మహిళలు వంటింట్లో ఉంటూ వ్రతాలు మాత్రమే చేసుకోవాలా? రాజకీయాలు చేయొద్దా? ఇదేనా వారు మహిళలకు ఇచ్చే గౌరవం అని షర్మిల ప్రశ్నించారు. ఇవాళ హైదరాబాద్​లోని లోటస్​ పాండ్​లో షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పలు అంశాల గురించి మాట్లాడారు.’

తెలంగాణకు దివంగత నేత వైఎస్సార్ వ్యతిరేకం కాదని ఆమె పేర్కొన్నారు. యూపీఏ- 1 మ్యానిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని రాజశేఖర్​రెడ్డే చేర్చారని గుర్తుచేశారు. ఇక్కడి ప్రజలకు ఎంతో మేలు చేశారని గుర్తు చేశారు. తాను ఏపీ సీఎం జగన్​తో విభేదించి పార్టీ పెట్టానని అంటున్నారని .. ఇదంతా తప్పుడు ప్రచారమని షర్మిల కొట్టిపారేశారు.

ఆడపడుచులు పుట్టింటితో గొడవలు పెట్టుకుంటే పార్టీలు పెడతారా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో వైఎస్సార్​ సంక్షేమ పాలన తీసుకొచ్చేందుకే తాను పార్టీ పెట్టానని స్పష్టం చేశారు. గతంలో వైఎస్సార్​ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఆయనను కలుసుకొనేందుకు అవకాశం ఉండేదని.. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్​ తోటి మంత్రులకు కూడా అపాయింట్​ మెంట్​ ఇవ్వడం లేదని.. తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతున్నదని ఆమె వ్యాఖ్యానించారు.

తాను తెలంగాణలో పుట్టి పెరిగానని ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు తనకు తెలుసని చెప్పారు. ‘ప్రతి ఒక్కరికి ఓ మతం ఉంటుంది. ఈ మతం ఇంటివరకే పరిమితం. రాజకీయాల్లోకి వచ్చిన వెంబడే నాకు మతాన్ని ఆపాదించడం దురదృష్టకరం’ అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.

‘ఉద్యమ నాయకుడైన కేసీఆర్​ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి.. ఇక్కడ పాలన బాగుంటుందని భావించాను. కానీ ఆ పరిస్థితి లేదు. నిరుద్యోగ సమస్య పోలేదు. పేదరికం పోలేదు. ప్రస్తుతం ఇక్కడ కొత్త రాజకీయపార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది, అందుకే నేను రాజకీయపార్టీని స్థాపించాను’ అంటూ షర్మిల పేర్కొన్నారు.

First Published:  16 July 2021 6:05 AM GMT
Next Story