Telugu Global
Cinema & Entertainment

చిన్న సినిమా.. పెద్ద రిలీజ్

ఈ మధ్యకాలంలో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు భారీ ఆదరణ దక్కుతోంది. ఇదే బాటలో చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు దూరంగా పెరిగిన అబ్బాయికి, అలాగే అబ్బాయిలకు దూరంగా పెరిగిన అమ్మాయికి మధ్య జరిగిన రొమాంటిక్ జర్నీ క‌థ‌తో యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం `ఇప్పుడు కాక ఇంకెప్పుడు`. హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ హీరో హీరోయిన్లుగా నటించారు. త‌నికెళ్ల భ‌ర‌ణి కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై చింతా రాజశేఖర్ రెడ్డి సమర్పణలో చింతా […]

చిన్న సినిమా.. పెద్ద రిలీజ్
X

ఈ మధ్యకాలంలో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు భారీ ఆదరణ దక్కుతోంది. ఇదే బాటలో
చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు దూరంగా పెరిగిన అబ్బాయికి, అలాగే అబ్బాయిలకు దూరంగా పెరిగిన
అమ్మాయికి మధ్య జరిగిన రొమాంటిక్ జర్నీ క‌థ‌తో యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం
'ఇప్పుడు కాక ఇంకెప్పుడు'.

హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ హీరో హీరోయిన్లుగా నటించారు. త‌నికెళ్ల భ‌ర‌ణి కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై చింతా రాజశేఖర్ రెడ్డి సమర్పణలో చింతా గోపాలకృష్ణ నిర్మిస్తున్నాడు. వై.యుగంధర్ ద‌ర్శ‌కుడు.

ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌కి, టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ చిత్రాన్ని జులై 30న విడుద‌ల
చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. ఇప్పుడీ చిన్న సినిమాకు పెద్ద సపోర్ట్ దక్కింది. జీ స్టుడియోస్ సంస్థ ఈ
సినిమా హక్కుల్ని దక్కించుకుంది. కంటెంట్ నచ్చి శాటిలైట్, డిజటల్ రైట్స్ ను కొనుగోలు చేయడంతో
పాటు.. మూవీ ప్రమోషన్ ను భారీ ఎత్తున చేస్తోంది. అదే ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది.

First Published:  16 July 2021 7:49 AM GMT
Next Story