Telugu Global
Cinema & Entertainment

స్టామినా సరిపోక ఆపేసిన హీరోయిన్

రీసెంట్ గా ఫార్ములా రేసింగ్ ప్రొగ్రామ్ లో లెవెల్-1 సర్టిఫికేట్ అందుకుంది నివేత పెతురాజ్. ఈ సందర్భంగా క్రీడలతో తనకున్న అనుబంధాన్ని బయటపెట్టింది. నిజానికి నివేతకు రేసింగ్ కంటే ఫుట్ బాల్ అంటే చాలా ఇష్టం అంట. కాకపోతే స్టామినా సరిపోక మధ్యలోనే ఆపేశానని చెబుతోంది. “రేసర్ అవ్వాలనేది నా జీవితాశయం కాదు. ట్రాక్ పైకి రావాలని అనిపించిందంతే. ఎందుకంటే, చిన్నప్పట్నుంచి స్పోర్ట్స్ అంటే ఇష్టం. 16 ఏళ్ల వరకు ఫుట్ బాల్ ఆడాను. స్టామినా చాలక […]

nivetha pethuraj
X

రీసెంట్ గా ఫార్ములా రేసింగ్ ప్రొగ్రామ్ లో లెవెల్-1 సర్టిఫికేట్ అందుకుంది నివేత పెతురాజ్. ఈ
సందర్భంగా క్రీడలతో తనకున్న అనుబంధాన్ని బయటపెట్టింది. నిజానికి నివేతకు రేసింగ్ కంటే ఫుట్
బాల్ అంటే చాలా ఇష్టం అంట. కాకపోతే స్టామినా సరిపోక మధ్యలోనే ఆపేశానని చెబుతోంది.

“రేసర్ అవ్వాలనేది నా జీవితాశయం కాదు. ట్రాక్ పైకి రావాలని అనిపించిందంతే. ఎందుకంటే,
చిన్నప్పట్నుంచి స్పోర్ట్స్ అంటే ఇష్టం. 16 ఏళ్ల వరకు ఫుట్ బాల్ ఆడాను. స్టామినా చాలక ఆ తర్వాత
కంటిన్యూ చేయలేకపోయాను. ప్రస్తుతం రేసులపై మనసుమళ్లింది.”

ఇలా ఆటలకు తనకు మధ్య ఉన్న బంధాన్ని బయటపెట్టింది నివేత పెతురాజ్. దుబాయ్ లో పుట్టిపెరిగిన
ఈ ముద్దుగుమ్మ, డాడ్జ్ ఛాలెంజర్ అనే కారును సొంతం చేసుకున్న రెండో మహిళగా అక్కడ రికార్డ్
సృష్టించింది. ఇప్పటికీ ఈ కారు తన గ్యారేజీలో ఉందని చెబుతోంది నివేత. మరో 2 వారాల్లో లెవెల్-2
రేసింగ్ లోకి ఎంటర్ అవుతానంటోంది ఈ ముద్దుగుమ్మ.

First Published:  15 July 2021 8:51 AM GMT
Next Story