Telugu Global
Business

5జీ ఫోన్లపై ఓ లుక్కేద్దామా?

లైఫ్ స్మార్ట్ గా ఉండాలంటే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ కొత్త కొత్త ఫీచర్లతో నెలకో ఫోన్ రిలీజ్ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో 5జీ ఫోన్ల ట్రెండ్ నడుస్తుంది. అందులో కొన్ని బెస్ట్ మోడల్స్ ఏంటంటే.. రెడ్ మీ కె40 5జీ రెడ్ మీ బ్రాండ్ లో అందుబాటులో ఉన్న 5జీ వెర్షన్ మొబైల్ రెడ్ మీ కె40 5జీ. ఈ 5జీ మొబైల్ ధ‌ర రూ. 25000 వ‌ర‌కూ […]

5జీ ఫోన్లపై ఓ లుక్కేద్దామా?
X

లైఫ్ స్మార్ట్ గా ఉండాలంటే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ కొత్త కొత్త ఫీచర్లతో నెలకో ఫోన్ రిలీజ్ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో 5జీ ఫోన్ల ట్రెండ్ నడుస్తుంది. అందులో కొన్ని బెస్ట్ మోడల్స్ ఏంటంటే..

రెడ్ మీ కె40 5జీ
రెడ్ మీ బ్రాండ్ లో అందుబాటులో ఉన్న 5జీ వెర్షన్ మొబైల్ రెడ్ మీ కె40 5జీ. ఈ 5జీ మొబైల్ ధ‌ర రూ. 25000 వ‌ర‌కూ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచ‌ర్ల విష‌యానికొస్తే.. 120Hz డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్, 5జీ చిప్ సెట్ తో వస్తుంది. 12GB వరకు ర్యామ్, 48 మెగాపిక్సెల్ రేర్ కెమెరాతో పాటు 33W ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తోంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎ 22 5జీ
ప్రముఖ మొబైల్ బ్రాండ్ శాంసంగ్ నుంచి కూడా 5జీ ఫోన్ రిలీజ్ అయింది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎ 22 5జీ పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ. 25000 వరకూ ఉంది. ఈ ఫోన్ ఫీచ‌ర్ల విష‌యానికొస్తే 6.4 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, మీడియాటెక్ 700 ప్రాసెసర్, 5000 ఎమ్ఏహెచ్‌ బ్యా టరీతో వస్తుంది.

రెడ్‌మీ నోట్ 10టీ 5జీ
రెడ్ మీ నోట్ 10టీ 5జీ ఫోన్ ఈ నెల 20న మార్కెట్లోకి రానుంది. ప్రస్తుతం రెడ్ మీ10 సిరీస్‌లో ఉన్న మొబైల్స్ కంటే ఈ ఫోన్ లో మరిన్ని కొత్త ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో పాటు, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ తో ఈ ఫోన్ రానుంది. 6జీబీ ర్యామ్‌+ 128జీబీ ర్యామ్ వేరియంట్లలో లభిస్తుంది. 48 ఎంపీ రేర్ కెమెరాతోపాటు ముందు 8ఎంపీ కెమెరా ఉంటుంది. దీని ధర సుమారు రూ. 20,000 వరకూ ఉండొచ్చు.

వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ
ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ మొబైల్ బ్రాండ్ గా రాణస్తున్న వన్‌ప్లస్ ఈ ఏడాది 5జీ ఫోన్‌ను తీసుకురానుంది. ఈ నెల 22న వన్ ప్లస్ నార్డ్ 2 5జీ పేరుతో మొబైల్ రిలీజ్ కానుంది. ఇందులో 6.43-అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ చిప్‌సెట్ ఉండనున్నాయి. 12జీబీ ర్యామ్‌ + 256జీబీ ఇంటర్నల్ మెమొరీ వేరియంట్లో ఈ ఫోన్‌ రాబోతుంది. ఈ ఫోన్‌ ధర రూ. 30 వేలు ఉండొచ్చు.

First Published:  15 July 2021 5:00 AM GMT
Next Story