Telugu Global
Health & Life Style

బీ12 లోపం రాకుండా ఉండాలంటే..

పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే దానికి విటమిన్స్ ఎంతో కీలకం. అయితే మనం తీసుకునే ఆహారం ద్వారా దాదాపు అన్నీ విటమిన్స్ లభిస్తాయి. కానీ చాలామందిలో విటమిన్ బీ12 మాత్రం లోపిస్తూ ఉంటుంది. ఎందుకంటే విటమిన్ బీ12 కొన్ని పదార్థాల ద్వారా మాత్రమే అందుతుంది. అవి సరైన మోతాదులో తీసుకోకపోతే బీ12 లోపం వస్తుంది. బీ12 విటమిన్ లోపం వల్ల ముఖ్యంగా చేతులు కాళ్లు తిమ్మర్లు పడుతుంటాయి. ఇంకా దాంతోపాటు అలసట, మతిమరుపు, కంటి చూపు మందగించడం, ఆకలి […]

బీ12 లోపం రాకుండా ఉండాలంటే..
X

పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే దానికి విటమిన్స్ ఎంతో కీలకం. అయితే మనం తీసుకునే ఆహారం ద్వారా దాదాపు అన్నీ విటమిన్స్ లభిస్తాయి. కానీ చాలామందిలో విటమిన్ బీ12 మాత్రం లోపిస్తూ ఉంటుంది. ఎందుకంటే విటమిన్ బీ12 కొన్ని పదార్థాల ద్వారా మాత్రమే అందుతుంది. అవి సరైన మోతాదులో తీసుకోకపోతే బీ12 లోపం వస్తుంది.

బీ12 విటమిన్ లోపం వల్ల ముఖ్యంగా చేతులు కాళ్లు తిమ్మర్లు పడుతుంటాయి. ఇంకా దాంతోపాటు అలసట, మతిమరుపు, కంటి చూపు మందగించడం, ఆకలి తగ్గడం, జీర్ణక్రియ సమస్యలు, చర్మ సమస్యలు వస్తుంటాయి. అలాగే విటమిన్ బీ12 లోపం వల్ల రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే బీ12 లోపం రాకుండా ఉండాలంటే కొన్ని పదార్థాలను తరచుగా తీసుకుంటుండాలి.

చేపలు
చేపల్లో శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే చేపలు తరచూ తింటుండడం వల్ల విటమిన్ బీ12 కూడా తగినంత అందుతుంది.

మాంసం..
విటమిన్ బీ 12 ఎక్కువగా మాంసాహారం మాత్రమే దొరుకుతుంది. చేపలు, మాంసం లాంటివి అప్పుడప్పుడు తింటుడడం వల్ల శరీరానికి కావల్సినంత బీ12 విటమిన్ అందుతుంది.

గుడ్లు
ఆరోగ్యానికి గుడ్లు చేసే మేలు అంతాఇంతా కాదు. రోజుకో గుడ్డు తినడం వల్ల ప్రొటీన్ లోపం, బీ12 లోపం రాకుండా ఉంటుంది. గుడ్డులోని పచ్చ సొనలో విటమిన్ బీ12 లభిస్తుంది. విటమిన్ డి తయారీకి కు కూడా గుడ్డు ఎంతగానో తోడ్పడుతుంది. మాంసాహారం తినని వాళ్లు కనీసం గుడ్డు అయినా అప్పుడప్పుడు తినడం వల్ల బీ12 లోపం నుంచి గట్టెక్కొచ్చు.

మష్రూమ్స్
మాంసాహారం అస్సలే ముట్టని వారు కనీసం నాటు పుట్టగొడుగులైనా తినాలి. శాఖాహారాల్లో కేవలం పుట్టగొడుగుల్లో మాత్రమే విటమిన్ బీ12 లభిస్తుంది. ఆకుకూరలు, పండ్లలో ఇది లభించదు. కాబట్టి పూర్తి శాఖాహారులు బీ12 లోపం రాకుండా జాగ్రత్తపడాలంటే మష్రూమ్స్ తింటూ ఉండాలి.

First Published:  14 July 2021 3:33 AM GMT
Next Story