Telugu Global
National

కాంవడ్ వేడుకలకు అనుమతి.. యూపీ సర్కార్​పై సుప్రీంకోర్టు ఆగ్రహం..!

ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విషయం ఏమిటంటే.. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో ఉత్తర్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​ రాష్ట్రాల్లో కాంవడ్​ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శివభక్తులు గంగా జలాలను సేకరిస్తుంటారు. ఈ నెల 25 నుంచి యూపీలో కాంవడ్​ ఉత్సవాలు చేసుకొనేందుకు యూపీ సర్కార్​ అనుమతి ఇచ్చింది. ఈ విషయంపై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వంపై మండిపడింది. ఓ వైపు దేశవ్యాప్తంగా థర్డ్​వేవ్​ వస్తుందని హెచ్చరికలు జారీ అవుతుంటే ఇటువంటి […]

కాంవడ్ వేడుకలకు అనుమతి.. యూపీ సర్కార్​పై సుప్రీంకోర్టు ఆగ్రహం..!
X

ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విషయం ఏమిటంటే.. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో ఉత్తర్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​ రాష్ట్రాల్లో కాంవడ్​ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శివభక్తులు గంగా జలాలను సేకరిస్తుంటారు. ఈ నెల 25 నుంచి యూపీలో కాంవడ్​ ఉత్సవాలు చేసుకొనేందుకు యూపీ సర్కార్​ అనుమతి ఇచ్చింది. ఈ విషయంపై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వంపై మండిపడింది.

ఓ వైపు దేశవ్యాప్తంగా థర్డ్​వేవ్​ వస్తుందని హెచ్చరికలు జారీ అవుతుంటే ఇటువంటి వేడుకలకు ఎందుకు అనుమతించారంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు యూపీ సర్కార్​కు నోటీసులు పంపించింది కోర్టు. మరోవైపు ఉత్తరాఖండ్​ ప్రభుత్వం మాత్రం కాంవడ్ వేడుకలకు అనుమతి ఇవ్వలేదు.ఈ విషయమై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్​ సింగ్​ ధామి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో యాత్రలకు అనుమతి ఇస్తే.. కరోనా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మరోవైపు యూపీ మాత్రం కఠిన ఆంక్షలతో ఈ వేడుకలకు అనుమతి ఇచ్చింది.

దాదాపు 15 రోజులపాటు ఈ వేడుకలు సాగుతాయి. ప్రతి శివభక్తుడు కచ్చితంగా ఆర్టీపీసీర్​ పరీక్షలు చేసుకోవాలని నిబంధన పెట్టింది. ఆర్టీపీసీఆర్​ పరీక్షలు చేయించుకొని నెగిటివ్​ వచ్చిన వారికి మాత్రమే.. వేడుకలకు అనుమతి ఇచ్చారు. ఇన్ని ఆంక్షలు విధించినప్పటికీ యూపీ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి.

మరోవైపు తీర్థ క్షేత్రాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మతపరమైన కార్యక్రమాలకు కొంతకాలం బ్రేక్​ ఇవ్వడం బెటర్​ అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. సుప్రీం నోటీసులు ఇచ్చిన నేపథ్యలో యూపీ సర్కార్​ వేడుకల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

First Published:  14 July 2021 5:06 AM GMT
Next Story