Telugu Global
CRIME

మొబైల్ పోయినా.. మన డేటా సేఫ్‌గా ఉండాలంటే..

ఇంట్లో దొంగలు పడే రోజులు పోయి, నెట్టింట్లో దొంగలు పడే రోజులొచ్చాయి. పొరపాటున మొబైల్ ను ఎక్కడైనా పోగొట్టుకున్నారంటే అంతే సంగతి. మన పర్సనల్ డేటా నుంచి, బ్యాంకింగ్ డీటెయిల్స్ వరకూ అన్నీ దొంగల చేతిలో పెట్టినట్టే. అందుకే మొబైల్ పోయినప్పుడు మన డేటాను ఎలా సేఫ్‌గా ఉంచుకోవాలో చూద్దాం. మొబైల్‌ ఫోన్ మిస్సయినా, చోరీ అయినా వెంటనే పోలీసులకు కంప్లయింట్ ఇవ్వాలి. ఆ ఎఫ్‌ఐఆర్‌ కాపీని తీసుకుని బ్యాంకు ప్రతినిధులను కలవాలి. అలాగే గూగుల్ పే, […]

మొబైల్ పోయినా.. మన డేటా సేఫ్‌గా ఉండాలంటే..
X

ఇంట్లో దొంగలు పడే రోజులు పోయి, నెట్టింట్లో దొంగలు పడే రోజులొచ్చాయి. పొరపాటున మొబైల్ ను ఎక్కడైనా పోగొట్టుకున్నారంటే అంతే సంగతి. మన పర్సనల్ డేటా నుంచి, బ్యాంకింగ్ డీటెయిల్స్ వరకూ అన్నీ దొంగల చేతిలో పెట్టినట్టే. అందుకే మొబైల్ పోయినప్పుడు మన డేటాను ఎలా సేఫ్‌గా ఉంచుకోవాలో చూద్దాం.

మొబైల్‌ ఫోన్ మిస్సయినా, చోరీ అయినా వెంటనే పోలీసులకు కంప్లయింట్ ఇవ్వాలి. ఆ ఎఫ్‌ఐఆర్‌ కాపీని తీసుకుని బ్యాంకు ప్రతినిధులను కలవాలి. అలాగే గూగుల్ పే, ఫోన్ పే, పేటియం లాంటి వ్యాలెట్ల వెబ్‌సైట్స్ లేదా ప్రతినిథులను కలిసి ఎఫ్ఐఆర్ కాపీని అందజేసి లావాదేవీలు జరగకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఫోన్‌ మిస్సయిన తక్షణం సిమ్‌ కార్డును బ్లాక్‌ చేయించాలి. అప్పుడు ట్రాన్సాక్షన్స్ జరిపినప్పుడు ఓటీపీలు రాకుండా ఉంటాయి.

కొన్ని లావాదేవీలు ఓటీపీ లేకుండా జరిగే ప్రమాదముంది కాబట్టి అలా జరగకుండా బ్యాంకింగ్‌ సేవలను బ్లాక్ చేయాలి. మీ నెంబర్ పైన ఉన్న బ్యాంక్‌ అకౌంట్స్ లేదా క్రెడిట్ డెబిట్ కార్డులను కూడా బ్లాక్ చేయడం ఉత్తమం. వీటితో పాటు మీ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లోకి లాగిన్ అయ్యి మీ నగదునంతా ఇంట్లో వాళ్ల అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

స్మార్ట్‌ఫోన్ పోయినప్పుడు వెంటనే బ్యాంక్ వాళ్లను సంప్రదించి, వ్యాలెట్ల యాక్సెస్‌ను బ్లాక్‌ చేయాలి.
వీటితో పాటు సోషల్ మీడియా అకౌంట్ పాస్‌వర్డ్ లు, జీమెయిల్ పాస్‌వర్డ్ లు కూడా వెబ్ ద్వారా లాగిన్ అయ్యి వెంటనే మార్చేయడం బెటర్.

First Published:  14 July 2021 3:46 AM GMT
Next Story