Telugu Global
Others

షుగర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలివే!

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మందిని వేధిస్తున్న ఒకే ఒక్క సమస్య డయాబెటిస్. డయాబెటిస్ కార‌ణంగా ఏటా లక్షల మంది చ‌నిపోతున్నారు. అయితే ఇందులో చాలామంది వారికి డయాబెటిస్ ఉందని తెలియక, తగిన జాగ్రత్తలు తీసుకోక ఎంతో నష్టపోతున్నారు. అందుకే డయాబెటిస్ లక్షణాలను ఎప్పటికప్పుడు ఓ కంట గమనిస్తూ ఉండాలి. డయాబెటిస్ ను ఎలా గుర్తించొచ్చంటే.. డయాబెటిస్ రాబోయే ముందు కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీన్నే ప్రీడయాబెటిక్ స్టేజ్ అంటారు. ఈ దశలో ఉన్నప్పుడు మనం గుర్తించగలిగితే […]

షుగర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలివే!
X

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మందిని వేధిస్తున్న ఒకే ఒక్క సమస్య డయాబెటిస్. డయాబెటిస్ కార‌ణంగా ఏటా లక్షల మంది చ‌నిపోతున్నారు. అయితే ఇందులో చాలామంది వారికి డయాబెటిస్ ఉందని తెలియక, తగిన జాగ్రత్తలు తీసుకోక ఎంతో నష్టపోతున్నారు. అందుకే డయాబెటిస్ లక్షణాలను ఎప్పటికప్పుడు ఓ కంట గమనిస్తూ ఉండాలి. డయాబెటిస్ ను ఎలా గుర్తించొచ్చంటే..

డయాబెటిస్ రాబోయే ముందు కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీన్నే ప్రీడయాబెటిక్ స్టేజ్ అంటారు. ఈ దశలో ఉన్నప్పుడు మనం గుర్తించగలిగితే తగిన జాగ్రత్తలు తీసుకుని కొంతవరకూ షుగర్ ను అదుపులో ఉంచొచ్చు.

డ‌యాబెటిస్‌లో రెండు ర‌కాలుంటాయి. మొద‌టి ర‌కం డ‌యాబెటిస్ వంశ పారంప‌ర్యంగా వ‌స్తే.. రెండోది అస్తవ్యవ‌స్తమైన జీవ‌న విధానం వ‌ల్ల వ‌స్తుంది. మొద‌టి ర‌కంలో శ‌రీరంలో ఇన్సులిన్ త‌యారు కాక‌పోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ ఎక్కువ‌గా పెరిగిపోతాయి. రెండో ర‌కంలో ఇన్సులిన్‌ను శ‌రీరం స‌రిగ్గా ఉప‌యోగించుకోక‌పోవ‌డం వ‌ల్ల గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. అయితే అది జరిగే ముందు మ‌న శ‌రీరంలో కొన్ని ల‌క్షణాలు క‌న‌బ‌డ‌తాయి.

జుట్టు రాలడం
టైప్ 2 డ‌యాబెటిస్ మొదలయ్యే దశలో చాలామందికి జుట్టు రాలిపోతుంటుంది. సడెన్ గా జుట్టు రాలిపోవడాన్ని గమనిస్తే వెంటనే డాక్టర్ను కలవడం మంచిది. ఒక్కోసారి ఒత్తిడి, థైరాయిడ్‌ సమస్యల వల్ల కూడా జుట్టు రాలిపోతుంటుంది. సమస్య ఏదన్నది డాక్టర్ను కలిస్తే తెలిసిపోతుంది.

అల‌స‌ట
రోజంతా అల‌స‌ట‌, నీర‌సంగా ఉంటుందంటే అది డ‌యాబెటిస్ వచ్చే సూచన కావొచ్చు. ఎందుకంటే డ‌యాబెటిస్ ఉన్నప్పుడు ర‌క్తంలో గ్లూకోజ్ లెవల్స్ లో మార్పొలొస్తాయి. ఈక్రమంలో మ‌న శరీరానికి శ‌క్తి స‌రిగ్గా అంద‌క శరీరం నీర‌సించిపోతుంది. అందుకే రోజూ అలసటగా అనిపిస్తుంటే ఓసారి షుగర్ టెస్ట్ చేయించుకోవడం బెటర్.

చ‌ర్మంపై మ‌చ్చలు
చర్మంపై ఎరుపు, బ్రౌన్, పసుపు రంగు మచ్చలు లేదా ప్యాచ్‌లు క‌నిపిస్తుంటే.. అది టైప్ 2 డ‌యాబెటిస్ లక్షణం కావొచ్చు. అందుకే ఇలాంటి సూచనలు కనిపిస్తే ఓ సారి డాక్టర్ను కలవడం మంచిది.

తరచూ మూత్ర విస‌ర్జన
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఎక్కువసార్లు మూత్రవిసర్జన జరగడం మామూలే. అయితే అలా కాకుండా తరచూ ఇలానే జరుగుతుంటే దాన్ని డ‌యాబెటిస్‌గా అనుమానించాలి. వెంట‌నే షుగర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.

వీటితో పాటు తలనొప్పి, చేతులు, కాళ్లు తిమ్మర్లు పట్టడం లాంటి లక్షణాలు కూడా డయాబెటిస్ ను సూచిస్తాయి.

First Published:  13 July 2021 3:15 AM GMT
Next Story