Telugu Global
Others

మాన్‌సూన్ టూరేద్దామా?

సెకండ్ వేవ్ తగ్గడంతో దేశంలో దాదాపు అన్ని పర్యాటక ప్రాంతాలు తెరుచుకున్నాయి. సెకండ్ వేవ్ తో సమ్మర్ లో టూర్ ప్లాన్ చేయలేకపోయిన వాళ్లు ఇప్పుడు తీరిగ్గా తిరిగొద్దామనుకుంటున్నారు. వ్యాక్సిన్ తీసుకుని, తగిన జాగ్రత్తలతో ట్రావెల్ చేయాలనుకుంటే ఈ నెలలో చూసేందుకు చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గగానే టూరిస్టు ప్లేసులకు పర్యాటకుల తాకిడి అమాంతం పెరిగింది. గత వారంలో మనాలీకి వేల సంఖ్యలో టూరిస్టులు సందడి చేశారు. ఈ జులై నెలలో టూరేయాలనుకుంటే […]

మాన్‌సూన్ టూరేద్దామా?
X

సెకండ్ వేవ్ తగ్గడంతో దేశంలో దాదాపు అన్ని పర్యాటక ప్రాంతాలు తెరుచుకున్నాయి. సెకండ్ వేవ్ తో సమ్మర్ లో టూర్ ప్లాన్ చేయలేకపోయిన వాళ్లు ఇప్పుడు తీరిగ్గా తిరిగొద్దామనుకుంటున్నారు. వ్యాక్సిన్ తీసుకుని, తగిన జాగ్రత్తలతో ట్రావెల్ చేయాలనుకుంటే ఈ నెలలో చూసేందుకు చాలానే ఆప్షన్స్ ఉన్నాయి.

కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గగానే టూరిస్టు ప్లేసులకు పర్యాటకుల తాకిడి అమాంతం పెరిగింది. గత వారంలో మనాలీకి వేల సంఖ్యలో టూరిస్టులు సందడి చేశారు. ఈ జులై నెలలో టూరేయాలనుకుంటే బెస్ట్ ఆప్షన్స్ ఇవే.

మేఘాలయ
మాన్ సూన్ ట్రావెల్ అంటే మొదట గుర్తొచ్చేది మేఘాలయ. ఇక్కడ ఏడాది పొడవునా వర్షాలు కురుస్తూనే ఉంటాయి. ముఖ్యంగా జులై నెలలో ఇక్కడ వాతావారణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. చుట్టూ చిన్న చిన్న కొండలు, సరస్సులతో మేఘాలయా అంతా పచ్చగా అలరిస్తుంది. షిల్లాంగ్, చిరపుంజి, లివింగ్ రూట్ బ్రిడ్జ్, ఎలిఫెంట్ ఫాల్స్, ఉమియమ్‌‌‌‌ లేక్‌, బాల్పక్రామ్ నేషనల్ పార్క్ ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు. మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్ కు అన్ని సిటీస్ నుంచి ఫ్లైట్స్‌‌‌‌ ద్వారా చేరుకోవచ్చు. ఎలాంటి ఈ పాస్ అవసరం లేదు. కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ ఉండాలి. రాష్ట్రానికి చేరుకోగానే కోవిడ్ స్క్రీనింగ్ ఉంటుంది.

వ్యాలీ ఆఫ్‌‌‌‌ ఫ్లవర్స్‌‌‌‌
యునెస్కో గుర్తింపు పొందిన‌‌‌ 'వ్యాలీ ఆఫ్‌‌‌‌ ఫ్లవర్స్‌‌‌‌ నేషనల్‌‌‌‌ పార్క్‌‌‌‌' ను సందర్శించడానికి జులై నెల అనువైనది. ఈ నెలలో ఈ వ్యాలీ అంతా పూలతో నిండి అందంగా ముస్తాబవుతుంది. ఉత్తరాఖండ్‌‌‌‌లోని చమోలి–పితోర్​గఢ్​ మధ్యలో ఉండే ఈ వ్యాలీ మాన్ సూన్ సీజన్ లో పూలతో పరిచిన పరదాలా మారిపోతుంది. అందుకే దీనికి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని పేరు. పర్వతాలపై పచ్చగా ఎదిగిన పూల మధ్య ట్రెక్కింగ్‌‌‌‌ చేయడం మరపురాని అనుభూతినిస్తుంది. డెహ్రాడూన్‌‌‌‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ వ్యాలీ బద్రీనాథ్ కు దగ్గర్లో ఉంటుంది. ప్రస్తుతం ఉత్తరాఖండ్ కు వెళ్లాలంటే ఈ పాస్, కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి.

కాజా, స్పితి వ్యాలీ
హిమాలయ పర్వతాల మధ్యలో ఉండే అందమైన స్పితి లోయను చూసేందుకు ఇదే అనువైన సమయం. ఈ సమయంలో ఇక్కడ మంచు తక్కువగా ఉండి ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బుద్ధిస్ట్ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది. ప్రసిద్ధి చెందిన కీ మోనాస్టరీ, టబూ మొనాస్టరీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడికి మనాలీ నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. హిమాచల్ కు చేరుకోవాలంటే ఈ పాస్, కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి.

First Published:  8 July 2021 3:06 AM GMT
Next Story