Telugu Global
International

హెచ్​ఐవీకి వ్యాక్సిన్​?

ఇప్పటివరకు ఎటువంటి చికిత్స, మందు లేని ఓ భయంకరమైన వైరస్​ హెచ్​ఐవీ. ఇది ఎయిడ్స్​ అనే ఓ భయంకరమైన వ్యాధిని కలుగజేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎయిడ్స్​కు చికిత్స తీసుకొచ్చేందుకు, వ్యాక్సిన్​ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు విరామం లేకుండా శ్రమిస్తున్నారు. కానీ ఇంతవరకు వ్యాక్సిన్​ అందుబాటులోకి రాలేదు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్​కు సైతం ఇప్పటికే వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అవి ఎంత మేరకు పనిచేస్తున్నాయన్న విషయంపై ఇప్పటికీ కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా […]

హెచ్​ఐవీకి వ్యాక్సిన్​?
X

ఇప్పటివరకు ఎటువంటి చికిత్స, మందు లేని ఓ భయంకరమైన వైరస్​ హెచ్​ఐవీ. ఇది ఎయిడ్స్​ అనే ఓ భయంకరమైన వ్యాధిని కలుగజేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎయిడ్స్​కు చికిత్స తీసుకొచ్చేందుకు, వ్యాక్సిన్​ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు విరామం లేకుండా శ్రమిస్తున్నారు. కానీ ఇంతవరకు వ్యాక్సిన్​ అందుబాటులోకి రాలేదు.

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్​కు సైతం ఇప్పటికే వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అవి ఎంత మేరకు పనిచేస్తున్నాయన్న విషయంపై ఇప్పటికీ కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్​ కొనసాగుతున్నది. ఇదిలా ఉంటే తాజాగా హెచ్​ఐవీకి సైతం త్వరలో వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఈ మేరకు ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీలో ముమ్మరంగా పరిశోధనలు సాగుతున్నాయి.

హెచ్​ఐవీ వ్యాక్సిన్​కు సంబంధించి ఆక్స్​ఫర్డ్​లో తొలి దశ ట్రయల్స్​ జరుగుతున్నట్టు సమాచారం. మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్​ పూర్తయితే వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చే ఛాన్స్​ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హెచ్​ఐవీ వైరస్​ ప్రధానంగా రోగి శరీరంలోని రోగనిరోధకశక్తిని క్రమంగా తగ్గిస్తుంది. ప్రస్తుతం ఈ వ్యాధికి కొంత మేర చికిత్స అందుబాటులో ఉంది. అయినా ఎయిడ్స్​ వచ్చిన వారు పూర్తిగా కోలుకోలేకపోతున్నారు. కానీ వారి జీవితకాలం గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ.. టీకా భద్రత, రోగ నిరోధకశక్తి పెంచడం అనే అంశాల ఆధారంగా ఓ వ్యాక్సిన్​ను తయారుచేస్తున్నది.

18 నుండి 65 ఏళ్ల వయస్సు గల 13 మంది హెచ్ఐవీ నెగిటివ్ కలిగిన వారిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. మొదట వారికి వ్యాక్సిన్ డోస్ ఒకటి ఇస్తారు. మళ్లీ నాలుగు వారాల తర్వాత మరో బూస్టర్ డోస్ ను ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్​తో రోగనిరోధక శక్తి పెరిగే అవకాశం ఉందని.. 2022లో ఈ వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చే ఛాన్స్​ ఉందంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

First Published:  8 July 2021 3:36 AM GMT
Next Story