Telugu Global
NEWS

పీసీసీ అధ్యక్షుడు రేవంత్​పై కేసు ..!

పీసీసీ అధ్యక్షుడిగా నిన్న బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డిపై హైదరాబాద్​ పోలీసులు కేసు నమోదుచేశారు. బుధవారం గాంధీ భవన్​లో అట్టహాసంగా రేవంత్​ ప్రమాణ స్వీకారం జరిగిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు నగరంలో ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. జూబ్లీహిల్స్​ లోని ఆయన ఇంటి నుంచి గాంధీ భవన్​ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో కాంగ్రెస్​ శ్రేణులు, రేవంత్​ అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఇదిలా ఉంటే రేవంత్​రెడ్డిపై జూబ్లీహిల్స్​ ఎస్సై యాకన్న పోలీసులకు ఫిర్యాదు […]

పీసీసీ అధ్యక్షుడు రేవంత్​పై కేసు ..!
X

పీసీసీ అధ్యక్షుడిగా నిన్న బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డిపై హైదరాబాద్​ పోలీసులు కేసు నమోదుచేశారు. బుధవారం గాంధీ భవన్​లో అట్టహాసంగా రేవంత్​ ప్రమాణ స్వీకారం జరిగిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు నగరంలో ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. జూబ్లీహిల్స్​ లోని ఆయన ఇంటి నుంచి గాంధీ భవన్​ వరకు ర్యాలీ కొనసాగింది.

ఈ ర్యాలీలో కాంగ్రెస్​ శ్రేణులు, రేవంత్​ అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఇదిలా ఉంటే రేవంత్​రెడ్డిపై జూబ్లీహిల్స్​ ఎస్సై యాకన్న పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. రేవంత్​ రెడ్డి అనుచరులు, కాంగ్రెస్​ కార్యకర్తలు జూబ్లీ హిల్స్​ ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్​ అంతరాయం కలిగించారని.. పలు రోడ్లు బ్లాక్​ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డిపై ఓ ఎస్సై ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ కేసుపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఇక గాంధీ భవన్​లో ప్రమాణం చేసిన అనంతరం రేవంత్​రెడ్డి.. టీఆర్​ఎస్​ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్​పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మరోవైపు రేవంత్​ పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్​ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.

First Published:  8 July 2021 2:17 AM GMT
Next Story