Telugu Global
National

దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కి మతం రంగు.. బీజేపీ నేత చీప్ ట్వీట్..

బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మరణంపై దేశవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్న వేళ, బీజేపీ హర్యాణా ఐటీ, సోషల్ మీడియా వింగ్ అధిపతి అరుణ్ యాదవ్ వేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపీ మత రాజకీయాలను మరోసారి ప్రముఖంగా తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో బీజేపీని నెటిజన్లు చెడామడా తిడుతూ మెసేజ్ లు పెడుతున్నారు. దిలీప్ కుమార్ మరణానికి నివాళి అంటూ, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి అంటూనే బీజేపీ […]

దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కి మతం రంగు.. బీజేపీ నేత చీప్ ట్వీట్..
X

బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మరణంపై దేశవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్న వేళ, బీజేపీ హర్యాణా ఐటీ, సోషల్ మీడియా వింగ్ అధిపతి అరుణ్ యాదవ్ వేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపీ మత రాజకీయాలను మరోసారి ప్రముఖంగా తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో బీజేపీని నెటిజన్లు చెడామడా తిడుతూ మెసేజ్ లు పెడుతున్నారు.

దిలీప్ కుమార్ మరణానికి నివాళి అంటూ, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి అంటూనే బీజేపీ హర్యాణా నేత అరుణ్ యాదవ్ మతం పేరుతో ట్వీట్ వేశారు. దిలీప్ కుమార్ అనే హిందూ పేరు పెట్టుకుని మొహ్మద్ యూసఫ్ ఖాన్ అనే నటుడు బాలీవుడ్ లో డబ్బులు బాగా సంపాదించారని, హిందూ పేరుని అడ్డు పెట్టుకుని ఆయన ఎదిగారని, అలాంటి నటుడి మరణం నిజంగానే చిత్ర పరిశ్రమకు తీరని లోటు అనేది ఆ ట్వీట్ సారాంశం.

అరుణ్ యాదవ్ ట్వీట్ తో అనివార్యంగా బీజేపీ కూడా ఇరుకున పడింది. నెటిజన్లంతా బీజేపీని తీవ్రంగా తప్పుబడుతున్నారు. మరణంలో కూడా మత రాజకీయాలను వదిలిపెట్టరా అంటూ మండిపడుతున్నారు. అరుణ్ యాదవ్, నిన్ను చూస్తుంటే సిగ్గేస్తోంది అంటూ ప్రముఖ నటి ఊర్మిళ ట్వీట్ చేశారు. బీజేపీ ఉన్నంతకాలం దేశంలో మతాల మధ్య చిచ్చు రగులుతూనే ఉంటుందని అంటున్నారు నెటిజన్లు.

ఓవైపు మంత్రివర్గ విస్తరణతో దేశవ్యాప్తంగా బీజేపీలో సందడి నెలకొంటే, మరోవైపు ఇలాంటి చీప్ ట్వీట్లు వేసి పార్టీ పరువుని రచ్చకీడ్చారు అరుణ్ యాదవ్. అయితే ఆ పార్టీ నేతలెవరూ దీనిపై స్పందించకపోవడం విశేషం. వివాదానికి కారణం అయిన ఆ ట్వీట్ ని ఇంకా తొలగించకపోవడం బీజేపీ బరితెగింపుకి ఉదాహరణ.

Next Story