Telugu Global
NEWS

ఏపీలో బడిగంట మోగేది అప్పుడే..

ఏపీలో ఈనెల 1నుంచి స్కూల్ గేట్లు తెరుచుకున్నాయి. కానీ కేవలం ఉపాధ్యాయుల‌కే లోపలికి ఎంట్రీ. అది కూడా ఈరోజు సగం మంది వస్తే, రేపు సగం మంది రావాలి. స్టూడెంట్స్ కి ఆన్ లైన్ పాఠాలు చెప్పేందుకు వీరంతా కసరత్తులు చేసుకుంటున్న వేళ, బడిగంట మోగే తేదీని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో ఆగస్ట్ 16నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభం అవుతాయి. విద్యార్థులంతా ఆరోజు పుస్తకాలు పట్టుకుని పాఠశాలలకు రావాల్సి ఉంటుంది. ఈనెల 12నుంచి ఏపీలోని అన్ని […]

ఏపీలో బడిగంట మోగేది అప్పుడే..
X

ఏపీలో ఈనెల 1నుంచి స్కూల్ గేట్లు తెరుచుకున్నాయి. కానీ కేవలం ఉపాధ్యాయుల‌కే లోపలికి ఎంట్రీ. అది కూడా ఈరోజు సగం మంది వస్తే, రేపు సగం మంది రావాలి. స్టూడెంట్స్ కి ఆన్ లైన్ పాఠాలు చెప్పేందుకు వీరంతా కసరత్తులు చేసుకుంటున్న వేళ, బడిగంట మోగే తేదీని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో ఆగస్ట్ 16నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభం అవుతాయి. విద్యార్థులంతా ఆరోజు పుస్తకాలు పట్టుకుని పాఠశాలలకు రావాల్సి ఉంటుంది.

ఈనెల 12నుంచి ఏపీలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఆన్ లైన్ క్లాసులు మొదలు కాబోతున్నాయి. దీనికి సంబంధించి స్టడీ మెటీరియల్ ని తల్లిదండ్రులకు ఇవ్వబోతున్నారు. నెలరోజులపాటు ఆన్ లైన్ క్లాసులు జరిగిన అనంతరం ఆగస్ట్ 16నుంచి పిల్లలు స్కూల్స్ కి తిరిగి వస్తారు. ఈలోగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో నాడు-నేడు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం జగన్. అదే సమయంలో ఉపాధ్యాయులకు వర్క్ బుక్స్ పై శిక్షణ ఉంటుందని తెలియజేశారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఈనెల 15నుంచి ఆగస్ట్ 15 వరకు ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలుంటాయని చెప్పారు. అంగన్వాడీ స్కూల్స్ ని కూడా సమీప ప్రాథమిక పాఠశాల భవనాల్లోకి మార్చేయబోతున్నారు. రెండేళ్ల ఫౌండేషన్ కోర్స్ గా దీన్ని రూపొందించి అదనపు తరగతి గదుల్ని నిర్మిస్తారు.

ఇంటర్ మార్కులు ఇలా..
ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి మార్కుల కేటాయింపు ఎలా జరుగుతుందనే విషయంపై క్లారిటీ ఇచ్చారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో వచ్చిన మార్కులకు 70శాతం వెయిటైజీ ఇస్తారు, టెన్త్ క్లాస్ లో వచ్చిన మార్కులకు 30శాతం వెయిటైజీ ఇచ్చి.. ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ విడుదల చేస్తామని చెప్పారు. నెలాఖరులోపు ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేస్తామన్నారు.

Next Story