Telugu Global
NEWS

ఏపీలో సచివాలయాలు మరింత పటిష్టం..

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలను మరింత పటిష్టం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సచివాలయాల వల్ల చాలా వరకు గ్రామస్తులు ఊరుదాటి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. పట్టణాల్లో ప్రతి పనికి సిబ్బంది చేయి తడపాల్సిన అగత్యం లేకుండా పోయింది. జనాలతో కిటకిటలాడే మీసేవా సెంటర్లు కూడా వెలవెలబోయాయి. ఎమ్మార్వో ఆఫీస్ ల చుట్టూ తిరగాల్సిన శ్రమ తప్పింది. సచివాలయ వ్యవస్థను, అక్కడ అందుతున్న సేవలపై ఇతర రాష్ట్రాలు కూడా అధ్యయనం చేస్తున్నాయంటే పరిస్థితిని అర్థం […]

ఏపీలో సచివాలయాలు మరింత పటిష్టం..
X

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలను మరింత పటిష్టం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సచివాలయాల వల్ల చాలా వరకు గ్రామస్తులు ఊరుదాటి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. పట్టణాల్లో ప్రతి పనికి సిబ్బంది చేయి తడపాల్సిన అగత్యం లేకుండా పోయింది. జనాలతో కిటకిటలాడే మీసేవా సెంటర్లు కూడా వెలవెలబోయాయి. ఎమ్మార్వో ఆఫీస్ ల చుట్టూ తిరగాల్సిన శ్రమ తప్పింది. సచివాలయ వ్యవస్థను, అక్కడ అందుతున్న సేవలపై ఇతర రాష్ట్రాలు కూడా అధ్యయనం చేస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇకపై ఏపీలోని సచివాలయాలు మరింత పటిష్టం కాబోతున్నాయి. కొత్తగా మరో 200 సేవల్ని సచివాలయాల్లో అందుబాటులోకి తేవాలని చూస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. రేషన్ కార్డులు, పింఛన్లు, ప్రభుత్వ బీమా పథకాలు, ఇళ్ల పట్టాలు వంటి వాటికి అప్లికేషన్లు నింపడమే కాకుండా, ఫిర్యాదులు స్వీకరించి సత్వరం పరిష్కరిస్తోంది సచివాలయ వ్యవస్థ. ఇటీవల ఆధార్ సేవల్ని కూడా సచివాలయాల పరిధిలోకి తీసుకొచ్చారు. వీటితోపాటు 200 సేవల్ని అదనంగా చేర్చబోతున్నారు. ఇప్పటికే బయోమెట్రిక్ హాజరుతో ఉద్యోగుల్లో మరింత నిబద్ధత పెంచారు. ఇకపై ప్రతి సచివాలయాన్ని స్థానిక ఎమ్మెల్యేలు, జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లు ప్రతివారం సందర్శిస్తారు. దీనికి సంబంధించిన కసరత్తు మొదలైంది. దీంతో సచివాలయ వ్యవస్థ మరింత పటిష్టం కాబోతున్నట్టు తెలుస్తోంది.

సమస్యలు కూడా పరిష్కరిస్తారా..?
సచివాలయ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉన్నా.. సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా 30శాతం సచివాలయాలకు సరైన ఇంటర్నెట్ వ్యవస్థ అందుబాటులో లేదు. మౌలిక వసతుల నిధుల కేటాయింపు పంచాయతీ సెక్రటరీల పరిధిలో ఉండటంతో కార్యాలయాల్లో సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. సచివాలయాలకు అధిపతి ఎవరనే విషయంపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వం. డ్రాయింగ్ ఆఫీసర్లుగా వీఆర్వోలను నియమించారు కానీ కొన్ని కారణాల వల్ల ఆ నిర్ణయం వాయిదా పడుతూ వస్తోంది. సిగ్నల్ సమస్య, పరికరాల సమస్యలతో బయెమెట్రిక్ హాజరు అమలు అంతంతమాత్రంగానే ఉంటోంది. ఉన్నతాధికారుల తనిఖీల ద్వారా ఆయా సమస్యలు పరిష్కారమైతే సచివాలయ వ్యవస్థ మరింత పటిష్టం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

First Published:  7 July 2021 3:01 AM IST
Next Story