Telugu Global
Health & Life Style

కరోనానుంచి కోలుకున్నాక బోన్ డెత్..

కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎక్కువమంది డాక్టర్లు స్టెరాయిడ్స్ ని నమ్ముకోవడంతో కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి. బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువ కావడానికి కూడా చికిత్సా విధానమే కారణం అని తేలుతోంది. బ్లాక్ ఫంగస్ వంటి లక్షణాలు పైకి కనపడతాయి కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే కనిపించని కొన్ని లక్షణాలు ఇప్పుడు కరోనా విజేతల్ని కనికరం లేకుండా కాటేస్తున్నాయి. బోన్ డెత్.. కరోనానుంచి కోలుకున్నవారిలో బోన్ డెత్ అనేది సాధారణ సమస్యగా మారిందని మహారాష్ట్రలో వెలుగు […]

కరోనానుంచి కోలుకున్నాక బోన్ డెత్..
X

కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎక్కువమంది డాక్టర్లు స్టెరాయిడ్స్ ని నమ్ముకోవడంతో కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి. బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువ కావడానికి కూడా చికిత్సా విధానమే కారణం అని తేలుతోంది. బ్లాక్ ఫంగస్ వంటి లక్షణాలు పైకి కనపడతాయి కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే కనిపించని కొన్ని లక్షణాలు ఇప్పుడు కరోనా విజేతల్ని కనికరం లేకుండా కాటేస్తున్నాయి.

బోన్ డెత్..
కరోనానుంచి కోలుకున్నవారిలో బోన్ డెత్ అనేది సాధారణ సమస్యగా మారిందని మహారాష్ట్రలో వెలుగు చూస్తున్న కేసుల ద్వారా తెలుస్తోంది. మహారాష్ట్రలో బోన్ డెత్ గా వ్యవహరించే అవాస్కుల‌ర్ నెక్రోసిస్(ఏవీఎన్‌) కేసులు పెరిగిపోతున్నాయి. ముంబై స‌హా రాష్ట్ర‌మంతా క‌రోనా నుంచి కోలుకున్న వారిలో ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్న‌ట్లు ఆర్థోపెడిక్ స్పెష‌లిస్టులు చెబుతున్నారు. ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో మూడు కేసులు బయటపడ్డాయి. నాగపూర్ లో నెలరోజుల్లో 40మంది బోన్ డెత్ సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందారు. అహ్మద్ నగర్ లో ఓ డాక్టర్ కూడా ఇలాంటి సమస్యతో బాధపడి కోలుకుంటున్నారు. తన వద్దకు వచ్చిన 17మంది రోగులకు బోన్ డెత్ కి సంబంధించి చికిత్స చేసిన ఆయన చివరకు ఏవీఎన్ బారిన పడటం విశేషం.

శరీరంలో స‌రిప‌డా ర‌క్తం లేక ఎముక క‌ణ‌జాలం చ‌నిపోవ‌డాన్ని అవాస్కుల‌ర్ నెక్రోసిస్ (ఏవీఎన్‌) లేదా బోన్ డెత్ అంటారు. దీనివ‌ల్ల ఎముక‌లో ప‌గుళ్లు ఏర్ప‌డి ప‌నికి రాకుండా పోతుంది. స్టెరాయిడ్లు ఎక్కువ‌గా వాడటం, ఆల్క‌హాల్ ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య వ‌స్తుంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. తీవ్రమైన కొవిడ్ ల‌క్ష‌ణాల‌తో ఆస్పత్రిలో చేరిన పేషెంట్లకు ఎక్కువ మొత్తంలో స్టెరాయిడ్స్ వాడ‌టం వ‌ల్ల వారిలో ఎక్కువ‌గా ఏవీఎన్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి. 30 నుంచి 50 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న వారిలో ఇది సాధార‌ణంగా క‌నిపిస్తోంది. మెడ‌, భుజాలు, మోకాళ్లు, గ‌జ్జ‌ల్లో వాపు, నొప్పి.. దీని లక్షణాలు. బ‌రువులు మోసేటప్పుడు, కూర్చున్నా, పడుకున్నా.. ఎముకల్లో విపరీతమైన నెప్పి అనిపిస్తే.. బోన్ డెత్ గా అనుమానించాల్సిందే.

గాల్‌ బ్లాడ‌ర్ సమస్యలు కూడా..
గాల్ బ్లాడర్ లో రాళ్లు ఉన్నప్పుడు సాధారణంగా వాపు, నెప్పి వస్తుంది. కానీ కొవిడ్ నుంచి కోలుకున్న చాలామందిలో రాళ్లు లేకుండానే ఇన్ ఫ్లమేషన్ ని గుర్తించినట్టు చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా మహిళలు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారట. ఢిల్లీ, ముంబై లో ఎక్కువగా ఈ తరహా కేసులు గుర్తించారు వైద్యులు.

First Published:  6 July 2021 9:19 PM GMT
Next Story