Telugu Global
National

మమత ముందు జాగ్రత్త.. బెంగాల్ లో శాసన మండలి..

చట్ట సభల్లో సభ్యత్వం లేకుండా ముఖ్యమంత్రిగా ఎన్నికైతే కచ్చితంగా ఆరు నెలల్లోగా ఆ లాంఛనం పూర్తి చేయాలి. ఎన్నికల్లో పోటీచేసి చట్టసభకు ఎన్నిక కావాలి. శాసన మండలి ఉంటే, ఎన్నికలు లేకుండానే సునాయాసంగా గట్టెక్కొచ్చు. అలాంటి వెసులుబాటు లేకపోవడం, కరోనా వేళ, ఎన్నికల కమిషన్ పోలింగ్ కి వెనకాడ్డంతో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తిరత్ సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సరిగ్గా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీ […]

మమత ముందు జాగ్రత్త.. బెంగాల్ లో శాసన మండలి..
X

చట్ట సభల్లో సభ్యత్వం లేకుండా ముఖ్యమంత్రిగా ఎన్నికైతే కచ్చితంగా ఆరు నెలల్లోగా ఆ లాంఛనం పూర్తి చేయాలి. ఎన్నికల్లో పోటీచేసి చట్టసభకు ఎన్నిక కావాలి. శాసన మండలి ఉంటే, ఎన్నికలు లేకుండానే సునాయాసంగా గట్టెక్కొచ్చు. అలాంటి వెసులుబాటు లేకపోవడం, కరోనా వేళ, ఎన్నికల కమిషన్ పోలింగ్ కి వెనకాడ్డంతో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తిరత్ సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సరిగ్గా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించినా నందిగ్రామ్ లో మమత ఓటమిపాలయ్యారు. దీంతో చట్టసభలో సభ్యురాలు కాకుండానే ఆమె మే-5న పశ్చిమబెంగాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆరు నెలల లోపు ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాల్సిన సందర్భం. అప్పుడే రెండు నెలలు గడిచిపోయాయి. మరో 4 నెలలు మాత్రమే సమయం ఉంది. సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గలేదు, అటు థర్డ్ వేవ్ భయాలు కూడా ఉన్నాయి. ఈ దశలో ఎన్నికల కమిషన్, ఉప ఎన్నికలకు సాహసిస్తుందా, కేంద్రం దానికి అనుమతిస్తుందా అనేది అనుమానమే. అందుకే మమత కొత్త ఎత్తుగడ వేశారు. శాసన మండలిని పునరుద్ధరించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేశారు.

అడ్‌ హక్‌ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు వెస్ట్ బెంగాల్ లో శాసనమండలి కోసం తీర్మానం చేసినట్టు.. సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన శాసనసభ వ్యవహారాల మంత్రి పార్థ చటర్జీ తెలిపారు. 265 మంది సభ్యులు హాజరైన సభలో ఈ తీర్మానానికి అనుకూలంగా 196 మంది ఓటేయగా, బీజేపీకి చెందిన 69 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. అసెంబ్లీలో ఓడిపోయిన నాయకులకు అడ్డదారిలో సహకరించేందుకే దీనిని ప్రవేశపెట్టారని బీజేపీ ఆరోపించింది. ఈ నిర్ణయం వల్ల ఖజానాపై భారం పడుతుందని పేర్కొన్నారు బీజేపీ నేతలు.

అసెంబ్లీలో తీర్మానం చేసినా మండలి ఏర్పాటుకి కేంద్రం ఆమోద ముద్ర వేయాల్సిన అవసరం ఉంది. అసలే మమత అంటే ఉప్పు నిప్పులా ఉన్న కేంద్రం ఈ దశలో మండలి ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, కనీసం 4నెలలైనా కాలం గడిపి, మమత రాజీనామా చేసే పరిస్థితి తీసుకొచ్చి రివేంజ్ తీర్చుకుంటుందా అనేది వేచి చూడాలి.

Next Story