Telugu Global
Health & Life Style

విటమిన్ డి లోపిస్తుందా?

ఈ ప్యాండెమిక్ వల్ల చాలామందిలో విటమిన్ డి లోపం పెరుగుతోందని డాక్టర్లు చెప్తున్నారు. లాక్ డౌన్స్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమవ్వడంతో చాలామందిలో విటమిన్ డి లోపిస్తుంది. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఈ టైంలో విటమిన్ డి పొందడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సూర్యరశ్మికి దూరంగా ఎప్పుడూ ఇంట్లో ఉండటం వల్ల విటమిన్ డి లోపం ఈ మధ్యన బాగా పెరుగుతోందని డాక్టర్లు చెప్తున్నారు. అయితే విటమిన్ డి అనేది శరీరానికి కావల్సిన […]

విటమిన్ డి లోపిస్తుందా?
X

ఈ ప్యాండెమిక్ వల్ల చాలామందిలో విటమిన్ డి లోపం పెరుగుతోందని డాక్టర్లు చెప్తున్నారు. లాక్ డౌన్స్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమవ్వడంతో చాలామందిలో విటమిన్ డి లోపిస్తుంది. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఈ టైంలో విటమిన్ డి పొందడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
సూర్యరశ్మికి దూరంగా ఎప్పుడూ ఇంట్లో ఉండటం వల్ల విటమిన్ డి లోపం ఈ మధ్యన బాగా పెరుగుతోందని డాక్టర్లు చెప్తున్నారు. అయితే విటమిన్ డి అనేది శరీరానికి కావల్సిన ముఖ్యమైన విటమిన్. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సాయపడుతుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాన్సర్‌ను నివారిస్తుంది. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, డయాబెటిస్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల లాంటి సమస్యల నుంచి కాపాడుతుంది. అందుకే శరీరంలో విటమిన్ డి తగినంత ఉండేలా చూసుకోవాలి. విటమిన్ డి లోపిస్తే.. కండరాల తిమ్మిరి, వెన్నునొప్పి, అలసట, నిరాశ, నిద్ర రుగ్మతలు లాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.

ఇకపోతే విటమిన్ డి లోపం రాకుండా ఉండాలంటే కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. విటమిన్ డి సూర్యరశ్మి నుంచి వస్తుందని మనకు తెలిసు. అందుకే వారానికి రెండుమూడు సార్లు 15 నుంచి 20 నిమిషాలు ఉదయం ఎండలో ఉండాలి. గుడ్డు, కొత్తిమీర, నారింజ, పెరుగు, వెల్లుల్లి, డార్క్ చాక్లెట్, పుట్టగొడుగులు, పసుపు వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. అవసరమైతే డాక్టర్ల సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు.

First Published:  6 July 2021 1:39 AM GMT
Next Story