Telugu Global
NEWS

కృష్ణా బోర్డు నుంచి కోర్టుకెక్కిన జల జగడం..

అంతర్ రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తుంటారు. కృష్ణా నదీ జల వివాదాల పరిష్కారం కోసం, అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక మధ్య సమస్యల పరిష్కారం కోసం కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన అనంతరం ఏపీ, తెలంగాణ మధ్య కేంద్రం ఒప్పందం కుదిర్చింది, అప్పటి ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల నుంచి ఏపీ 66శాతం తెలంగాణ 34శాతం వాడుకోవాలని ఒప్పందం కుదిరింది. అయితే కేటాయింపుల్ని పక్కనపెట్టి […]

కృష్ణా బోర్డు నుంచి కోర్టుకెక్కిన జల జగడం..
X

అంతర్ రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తుంటారు. కృష్ణా నదీ జల వివాదాల పరిష్కారం కోసం, అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక మధ్య సమస్యల పరిష్కారం కోసం కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన అనంతరం ఏపీ, తెలంగాణ మధ్య కేంద్రం ఒప్పందం కుదిర్చింది, అప్పటి ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల నుంచి ఏపీ 66శాతం తెలంగాణ 34శాతం వాడుకోవాలని ఒప్పందం కుదిరింది. అయితే కేటాయింపుల్ని పక్కనపెట్టి తెలంగాణ జల విద్యుత్ ఉత్పత్తికోసం నీటిని ఏకపక్షంగా కిందకు వదిలేస్తోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతుండగా.. తెలంగాణ మాత్రం కుదరదంటోంది. అసలీ వివాదం రాయలసీమ ఎత్తిపోతలతో మొదలవగా.. ఇప్పుడది తెలంగాణ చేపట్టిన జలవిద్యుత్ ఉత్పత్తి వరకు వచ్చి చేరింది.

జలవివాదంపై ఇరు పక్షాలు కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుని ఆశ్రయించాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని ఆపేయించాలంటూ తెలంగాణ ఫిర్యాదు చేయగా, తెలంగాణ చేపట్టిన జలవిద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసేలా ఆదేశించాలని ఏపీ కోరింది. అయితే బోర్డు మధ్యే మార్గంగా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పింది, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈనెల 9న ఏర్పాటు చేయబోతున్న త్రిసభ్య కమిటీ సమావేశాన్ని రద్దు చేయాలంటోంది, పూర్తి స్థాయి బోర్డుని సమావేశ పరచాలని అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.

ఈ దశలో రెండు రాష్ట్రాల నాయకుల మధ్య మాటల తూాటాలు పేలుతున్నాయి. అయితే రైతులు మాత్రం దీన్ని కోర్టు వరకు తీసుకెళ్లారు. కృష్ణా జిల్లాకు చెందిన గూడవల్లి శివరామ కృష్ణ ప్రసాద్, వెంకటప్పయ్య అనే రైతులు తెలంగాణ హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కేంద్ర జలవనరులశాఖ, కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్, తెలంగాణ జెన్ కో, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, ఏపీ ఇరిగేషన్ శాఖలను ప్రతివాదులుగా చేర్చారు. నూటికి నూరుశాతం తెలంగాణ విద్యుత్‌ ప్రాజెక్టులు పనిచేయాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోని సస్పెండ్‌ చేయాలని పిటిషన్‌ లో పేర్కొన్నారు.. విద్యుత్‌ఉత్పత్తి పేరిట నీటిని విడుదలచేయడం వల్ల ఏపీకి తీవ్ర నష్టంవాటిల్లుతోందన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలియజేశారు.హైకోర్టు ఈ వ్యవహారంపై జోక్యం చేసుకుంటుందా, లేక తిరిగి కృష్ణా రివర్ బోర్డు ముందుకు సమస్యను ఉంచుతుందా అనేది తేలాల్సి ఉంది. ఎవరు చెప్పినా విద్యుత్ ఉత్పత్తి ఆపేది లేదంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్, కోర్టు విచారణను ఎలా ఎదుర్కుంటారో చూడాలి.

First Published:  4 July 2021 4:12 AM GMT
Next Story