Telugu Global
National

యూపీలో బీజేపీ మేకపోతు గాంభీర్యం..

ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ దారుణ పరాభవంపాలైన సంగతి తెలిసిందే. అదే సమయంలో ప్రతిపక్షాలు బాగానే పుంజుకున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందుగా యూపీలో అధికార పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బని తెలుస్తోంది. అయితే యూపీ బీజేపీ అప్పుడే హడావిడి మొదలు పెట్టింది. యూపీలో తమ పార్టీ వెలిగిపోతోందని, కావాలంటే ఈ సాక్ష్యాలు చూడండి అంటోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఈ నాటకంలోని తొలి ఘట్టాన్ని రక్తికట్టించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక […]

యూపీలో బీజేపీ మేకపోతు గాంభీర్యం..
X

ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ దారుణ పరాభవంపాలైన సంగతి తెలిసిందే. అదే సమయంలో ప్రతిపక్షాలు బాగానే పుంజుకున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందుగా యూపీలో అధికార పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బని తెలుస్తోంది. అయితే యూపీ బీజేపీ అప్పుడే హడావిడి మొదలు పెట్టింది. యూపీలో తమ పార్టీ వెలిగిపోతోందని, కావాలంటే ఈ సాక్ష్యాలు చూడండి అంటోంది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఈ నాటకంలోని తొలి ఘట్టాన్ని రక్తికట్టించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాల తరఫున గెలిచిన విజేతలందరికీ ఇటీవల బీజేపీ కాషాయ కండువాలు కప్పేసింది. స్థానిక ఎన్నికల్లో గెలిచినవారంతా అధికార పార్టీలోకి ఫిరాయించారు. డబ్బులు, ఏడాదికాలంలో చేసిపెట్టే పనులు.. అన్నీ ఎరగా వేసి బీజేపీ తన బలం పెరిగిందని చెబుతోంది.

జిల్లా పంచాయతీ చైర్ పర్సన్ ల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 75 సీట్లకు గాను బీజేపీ 67సీట్లలో గెలిచిందని ఇదే తమ భవిష్యత్ విజయాలకు సోపానం అని అంటున్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇదే ఊపులో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 300 సీట్లలో గెలుస్తుందని జోస్యం చెప్పారు యోగి.

యూపీలో యోగి నాటకం మొదలు..
వాస్తవాల్ని కప్పిపుచ్చి, అసత్యాలు, అర్ధ‌ సత్యాలు ప్రచారం చేసుకుంటూ తమ గొప్పలు చెప్పుకుంటూ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తోంది బీజేపీ. అందులోనూ ఇలాంటి డూప్ షాట్ ప్రచారంలో మోదీకంటే యోగి అందె వేసిన చేయి, ఈపాటికే ఆయన టీమ్, కాబోయే ప్రధాని అంటూ సోషల్ మీడియాలో యోగికి ఓ రేంజ్ లో భజన మొదలు పెట్టింది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో మనదే విజయం అంటూ ఢంకా భజాయిస్తోంది. జిల్లా పంచాయతీల చైర్ పర్సన్ ఎన్నికలను ఉదాహరణగా చూపెడుతూ యోగి ఈ నాటకానికి తెరతీశారు. అయితే యూపీలో బీజేపీ అంతర్గత సర్వేలు సహా, ఇతర అంచనాలన్నీ అధికార పార్టీకి ఓటమి తప్పదని చెబుతున్నాయి. ఓటమి ముందు బీజేపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందని, తమ అభ్యర్థులందరికీ ఎరవేసి, బీజేపీలో చేర్చుకుని చైర్ పర్సన్ స్థానాలు కైవసం చేసుకుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలనాటికి ఇలాంటి జిమ్మిక్కులేవీ పనిచేయవని అంటున్నాయి బీజేపీ వైరిపక్షాలు

First Published:  4 July 2021 4:02 AM GMT
Next Story