Telugu Global
Cinema & Entertainment

పవన్ కు రాజమౌళి తండ్రి కథ

విజయేంద్రప్రసాద్.. దేశంలోనే అత్యథిక పారితోషికం తీసుకుంటున్న రచయిత. ఇతడి కథలకు మంచి డిమాండ్ ఉంది. తనయుడు రాజమౌళి తీసే సినిమాలన్నింటికీ కథలు అందించడంతో పాటు ఇతర దర్శకులు, హీరోలకు కూడా కథలు అందిస్తున్నాడు విజయేంద్రప్రసాద్. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కు కూడా ఓ కథ వినిపించాడు ఈ సీనియర్ రైటర్. విజయేంద్రప్రసాద్ చెప్పిన కథ పవన్ కల్యాణ్ కు బాగా నచ్చిందట. స్పాట్ లో ఆ కథలో నటించడానికి ఓకే చెప్పారట. అయితే ఈ కథను […]

పవన్ కు రాజమౌళి తండ్రి కథ
X

విజయేంద్రప్రసాద్.. దేశంలోనే అత్యథిక పారితోషికం తీసుకుంటున్న రచయిత. ఇతడి కథలకు మంచి
డిమాండ్ ఉంది. తనయుడు రాజమౌళి తీసే సినిమాలన్నింటికీ కథలు అందించడంతో పాటు ఇతర
దర్శకులు, హీరోలకు కూడా కథలు అందిస్తున్నాడు విజయేంద్రప్రసాద్. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కు
కూడా ఓ కథ వినిపించాడు ఈ సీనియర్ రైటర్.

విజయేంద్రప్రసాద్ చెప్పిన కథ పవన్ కల్యాణ్ కు బాగా నచ్చిందట. స్పాట్ లో ఆ కథలో నటించడానికి
ఓకే చెప్పారట. అయితే ఈ కథను ఎవరు డైరక్ట్ చేస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. పవన్ ఓకే అనాలే కానీ,
టాలీవుడ్ లో దర్శకులంతా క్యూ కడతారు. కాబట్టి విజయేంద్రప్రసాద్ కథకు దర్శకుడ్ని వెదకడం సమస్య
కానేకాదు.

కాకపోతే.. ఈ కథ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే పవన్ ప్రస్తుతం చాలా బిజీగా
ఉన్నారు. చేతిలో 3 సినిమాలున్నాయి. మరో ప్రాజెక్టు పైప్ లైన్లో ఉందని కూడా టాక్. ఇలాంటి టైమ్ లో
విజయేంద్రప్రసాద్ కథకు ఎప్పుడు మోక్షం లభిస్తుందో చూడాలి.

First Published:  2 July 2021 2:50 PM IST
Next Story