Telugu Global
NEWS

అక్రమ మైనింగ్ లో అయ్యన్న కొడుకు విశ్వరూపం..

అక్రమ మైనింగ్ తో విశాఖ మన్యాన్ని దోచుకున్న టీడీపీ నేతల పాపాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కొడుకు విజయ్ అక్రమ మైనింగ్ వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. వారం రోజుల్లో రిపోర్ట్ రావాల్సి ఉంది. గతంలో గిరిజనుడు జె.లక్ష్మణ్ రావు పేరిట మైనింగ్ అనుమతులు ఉండగా.. పర్యావరణ అనుమతులు లభించకపోయే సరికి అప్పటి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, 2014లో కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కి […]

అక్రమ మైనింగ్ లో అయ్యన్న కొడుకు విశ్వరూపం..
X

అక్రమ మైనింగ్ తో విశాఖ మన్యాన్ని దోచుకున్న టీడీపీ నేతల పాపాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కొడుకు విజయ్ అక్రమ మైనింగ్ వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. వారం రోజుల్లో రిపోర్ట్ రావాల్సి ఉంది. గతంలో గిరిజనుడు జె.లక్ష్మణ్ రావు పేరిట మైనింగ్ అనుమతులు ఉండగా.. పర్యావరణ అనుమతులు లభించకపోయే సరికి అప్పటి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, 2014లో కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కి లేఖ రాశారు. ఎంపీ సిఫారసుతో అనుమతులు సులభంగా వచ్చాయి. ఆ తర్వాత అసలు విషయం తెరపైకొచ్చింది. గిరిజనుడి పేరు మీద లేటరైట్ తవ్వకాలకు అనుమతులు రాగానే వారిని బెదిరించి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి కొడుకు విజయ్, ఆండ్రూ మినరల్స్ పేరుతో అక్రమ మైనింగ్ మొదలు పెట్టారు. భూవనరుల్ని దోచుకున్నారు. అప్పట్లో మావోయిస్ట్ పార్టీ కూడా ఈ అక్రమాలను ఖండించింది. అయ్యన్నపాత్రుడు కొడుకు ఆగడాలను అడ్డుకోవాలని గిరిజనులకు సూచించింది. సహజవనరులను కొల్లగొడితే సహించేది లేదని హెచ్చరించారు మావోయిస్ట్ లు. అయినా కూడా వారి ఆగడాలు ఆగలేదు. ఆ పాపం పండేరోజు ఇన్నాళ్లకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టడంతో అసలు బండారం బయటపడబోతోంది.

పాపాలు కప్పిపుచ్చుకునేందుకు ఆరోపణలు..
టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలన్నీ ఒక్కొక్కటే బయటపడుతుండటంతో.. ఆ పార్టీ నేతలు రివర్స్ అటాక్ మొదలు పెట్టారు. వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి పేరుని ప్రచారంలోకి తెస్తూ కుట్రలకు తెరతీశారు. నెల్లూరు జిల్లా కావలి ప్రాంతంలోని ఫొటోలను టీడీపీ అనుకూల మీడియాలో ప్రచురించి, మన్యంలో వైసీపీ నేతలు మైనింగ్ కు పాల్పడుతున్నారంటూ కథనాలు వండి వారుస్తున్నారు.

వైసీపీ హయాంలో అనుమతులు లేవు..
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ విశాఖ మన్యంలో లేటరైట్ మైనింగ్ కి అనుమతులు ఇవ్వలేదు. ఆనాడు 400 ఎకరాల అటవీ భూముల్ని డీనోటిఫై చేసి మరీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు జగ్గీ వాసుదేవ్ కి అప్పగించారు. అలాంటి తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు వైసీపీపై నిందలు వేస్తున్నారు.

రోడ్డువేయడం తప్పా..?
తూర్పుగోదావరి జిల్లా రౌతుపూడి, విశాఖ జిల్లా నాతవరం మండలాల పరిధిలోని పలు గిరిజన గ్రామాల్ని కలుపుతూ వైసీపీ ప్రభుత్వం రోడ్లు వేయిస్తుంటే.. అడవిలో చెట్లను నరికేస్తున్నారంటూ టీడీపీ అనుకూల మీడియా రాద్ధాంతం చేస్తోంది. చెట్లను నరికి అటవీ సంపద నాశనం చేస్తున్నారంటూ గిరిజనుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. అనుకూల మీడియాతో ఎంతలా అపనిందలు వేయాలని చూసినా టీడీపీ నేతల పాచికలు పారడంలేదు. విజిలెన్స్ విచారణలో నిజానిజాలు నిగ్గుతేలతాయని అంటున్నారు వైసీపీ నేతలు.

First Published:  2 July 2021 8:07 AM GMT
Next Story