Telugu Global
Cinema & Entertainment

జగన్ బయోపిక్ హీరో దొరికాడు

యాత్ర సినిమాతో అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు దర్శకుడు మహి వి రాఘవ్. వైఎస్ఆర్ రాజకీయ ప్రస్థానాన్ని యాత్ర సినిమాలో చూపించిన ఈ దర్శకుడు, ఇప్పుడు జగన్ రాజకీయ ప్రస్థానాన్ని యాత్ర-2 సినిమాతో చూపించబోతున్నాడు. దీనికి సంబంధించి చాన్నాళ్ల కిందటే ప్రకటన చేసిన ఈ డైరక్టర్, ఇప్పుడీ బయోపిక్ కు సంబంధించి నటుడ్ని ఫిక్స్ చేశాడు. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి, తాజాగా స్కామ్-1992 అనే వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ పోషించిన ప్రతీక్ గాంధీని […]

జగన్ బయోపిక్ హీరో దొరికాడు
X

యాత్ర సినిమాతో అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు దర్శకుడు మహి వి రాఘవ్. వైఎస్ఆర్ రాజకీయ ప్రస్థానాన్ని
యాత్ర సినిమాలో చూపించిన ఈ దర్శకుడు, ఇప్పుడు జగన్ రాజకీయ ప్రస్థానాన్ని యాత్ర-2 సినిమాతో
చూపించబోతున్నాడు. దీనికి సంబంధించి చాన్నాళ్ల కిందటే ప్రకటన చేసిన ఈ డైరక్టర్, ఇప్పుడీ బయోపిక్
కు సంబంధించి నటుడ్ని ఫిక్స్ చేశాడు.

బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి, తాజాగా స్కామ్-1992 అనే వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ పోషించిన
ప్రతీక్ గాంధీని సెలక్ట్ చేశాడు మహి వి. రాఘవ్. జగన్ హావభావాలకు, బాడీ లాంగ్వేజ్ కు ప్రతీక్
అచ్చుగుద్దినట్టు సరిపోతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

నిజానికి జగన్ పాత్ర కోసం అజ్మల్ ను తీసుకుంటారని అంతా అనుకున్నారు. గతంలో జగన్ పాత్రలో
నటించిన అనుభవం ఇతడికి ఉంది. కానీ అజ్మల్ కంటే ప్రతీక్ అయితే బెటరని దర్శకుడు ఫీల్
అయ్యాడు. ప్రస్తుతం శ్రద్ధా శ్రీనాధ్ లీడ్ రోల్ లో ఓ ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు మహి. ఆ
సినిమా కంప్లీట్ అయిన వెంటనే యాత్ర-2 మొదలవుతుంది.

First Published:  2 July 2021 9:28 AM GMT
Next Story