Telugu Global
NEWS

చుక్కల మందుతో చిక్కులు.. ఎడతెగని వాదోపవాదాలు..

ఆనందయ్య ఆయుర్వేదం మందుకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. కళ్లలో వేసే చుక్కల మందు వ్యవహారం మాత్రం ఇంకా తేలలేదు. అసలు ఆనందయ్యను రాష్ట్రవ్యాప్తంగా పాపులర్ చేసింది ఆయన ఇచ్చే చుక్కల మందే. ఐసీయూ బెడ్ పై ఉన్నవారు, ఆక్సిజన్ సపోర్ట్ తో ఉన్నవారు కూడా చుక్కలమందు కంట్లో వేయగానే లేచి కూర్చునేవారు, ఆక్సిజన్ సపోర్ట్ లేకుండానే గలగలా మాట్లాడేవారు. ఇలాంటి వీడియోలన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆనందయ్య బాగా ఫేమస్ అయ్యారు. ఆయన ఆయుర్వేదం […]

చుక్కల మందుతో చిక్కులు.. ఎడతెగని వాదోపవాదాలు..
X

ఆనందయ్య ఆయుర్వేదం మందుకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. కళ్లలో వేసే చుక్కల మందు వ్యవహారం మాత్రం ఇంకా తేలలేదు. అసలు ఆనందయ్యను రాష్ట్రవ్యాప్తంగా పాపులర్ చేసింది ఆయన ఇచ్చే చుక్కల మందే. ఐసీయూ బెడ్ పై ఉన్నవారు, ఆక్సిజన్ సపోర్ట్ తో ఉన్నవారు కూడా చుక్కలమందు కంట్లో వేయగానే లేచి కూర్చునేవారు, ఆక్సిజన్ సపోర్ట్ లేకుండానే గలగలా మాట్లాడేవారు. ఇలాంటి వీడియోలన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆనందయ్య బాగా ఫేమస్ అయ్యారు. ఆయన ఆయుర్వేదం మందుకి దేశవ్యాప్తంగా పబ్లిసిటీ లభించింది. అయితే ఇప్పుడీ చుక్కలమందు వినియోగానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంటోంది. అధికారికంగా ఎలాంటి అనుమతులు ఇచ్చేది లేదని ఇప్పటికే పలుమార్లు తేల్చి చెప్పింది. కానీ ఆనందయ్య మాత్రం పట్టువదిలేలా లేరు. చుక్కల మందు విషయంలో కేంద్ర ఆయుష్ శాఖ ఆనందయ్యతో సంప్రదింపులు జరుపుతోందని హైకోర్టుకి వివరించారు ఆయన తరపు న్యాయవాది. కంటి చుక్కల మందు వినియోగం విషయంలో త్వరలో సానుకూల సంకేతాలు వస్తాయని భావిస్తున్నామని చెప్పారాయన. ఈ మందు విషయంలో వివిధ ల్యాబ్‌లు ఇచ్చిన నివేదికలను పరిశీలించి కౌంటర్‌ వేసేందుకు సమయం కావాలన్నారు. దీనికి అంగీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం విచారణను మరో 2వారాలు వాయిదా వేసింది.

కోవిడ్ రాకుండా ఒకరకం, వచ్చిన తర్వాత తగ్గేందుకు మరో రకం, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ఇంకో రకం.. ఇలా ఆనందయ్య వేర్వేరు రకాల మందులు పంపిణీ చేస్తున్నారు. కృష్ణపట్నం గ్రామానికి జనం పోటెత్తడంతో మందు పంపిణీ వ్యవహారం వివాదం అయిన తర్వాత ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాని సామర్థ్యాన్ని పరీక్షించి, సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ లేవని పంపిణీకి అనుమతులిచ్చింది. అయితే చుక్కలమందుని మాత్రం నిపుణులు పూర్తి స్థాయిలో సమర్థించలేదు. దాని ద్వారా కళ్ల సమస్యలు వస్తాయని ప్రభుత్వానికి నివేదిక‌లిచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చుక్కలమందు పంపిణీకి అధికారిక అనుమతిచ్చేది లేదని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

అటు ఆనందయ్య మాత్రం చుక్కలమందుని తక్కువ చేసి చూడొద్దని చెబుతున్నారు. ఈ విషయంలో కేంద్ర ఆయుష్ శాఖ కూడా తనతో సంప్రదింపులు జరుపుతోందని అంటున్నారు. కౌంటర్ దాఖలు చేయడానికి ఆనందయ్య తరపు లాయర్ గడువు కోరడంతో.. విచారణ మరో రెండు వారాలు వాయిదా పడింది. ఆనందయ్య చుక్కల మందుకి అధికారిక అనుమతి లభిస్తుందా లేదా తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

First Published:  1 July 2021 9:38 PM GMT
Next Story