Telugu Global
NEWS

ఏపీ రాజధాని హైదరాబాద్​ కాదు.. స్పష్టం చేసిన సుప్రీం

హైదరాబాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు కొంతకాలానికే హైదరాబాద్​ పూర్తిగా విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆయన అమరావతిని కేంద్రంగా చేసుకొని పాలన సాగించారు. ఇదిలా ఉంటే కరోనా సెకండ్​వేవ్​ టైంలో వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్​ నుంచి తెలంగాణకు వచ్చిన కొందరు బాధితులను ఇక్కడి పోలీసులు ఆపేశారు. ఇతర రాష్ట్రాలకు వచ్చే వారు తెలంగాణకు వైద్యం కోసం వచ్చేందుకు […]

ఏపీ రాజధాని హైదరాబాద్​ కాదు.. స్పష్టం చేసిన సుప్రీం
X

హైదరాబాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు కొంతకాలానికే హైదరాబాద్​ పూర్తిగా విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆయన అమరావతిని కేంద్రంగా చేసుకొని పాలన సాగించారు.

ఇదిలా ఉంటే కరోనా సెకండ్​వేవ్​ టైంలో వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్​ నుంచి తెలంగాణకు వచ్చిన కొందరు బాధితులను ఇక్కడి పోలీసులు ఆపేశారు. ఇతర రాష్ట్రాలకు వచ్చే వారు తెలంగాణకు వైద్యం కోసం వచ్చేందుకు వీల్లేదంటూ అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం ఓ నోటిఫికేషన్​ ను విడుదల చేసింది.

ఈ క్రమంలో ఏపీకి చెందిన న్యాయ విద్యార్థి క్రాంతి కుమార్‌ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్​ దాఖలు చేశారు. హైదరాబాద్​ ఇంకా ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి.. ఏపీ ప్రజలను తెలంగాణకు రాకుండా ఆపడం.. నోటిఫికేషన్​ విడుదల చేయడం చట్ట విరుద్ధమంటూ ఆయన పేర్కొన్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్​ను సవాలు చేస్తూ ఆయన పిటిషన్​ ను దాఖలు చేశారు.

అయితే ఈ పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏపీ రాజధాని హైదరాబాద్​ కాదంటూ స్పష్టం చేసింది. మీరింకా సెక్షన్​ 5 దగ్గరే ఆగిపోయారంటూ పిటిషనర్​ను ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది.
జాతీయ విపత్తు చట్టం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ జారీ చేసిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

First Published:  2 July 2021 5:49 AM GMT
Next Story