Telugu Global
National

ప్రజలకు చావమని సలహా ఇచ్చిన మంత్రి..!

ప్రైవేట్​ స్కూళ్ల ఫీజు దోపిడీ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. కార్పొరేట్ స్కూళ్ల మీద ప్రభుత్వ నియంత్రణ ఉండదు.. దీంతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ సామాన్యుల నడ్డి విరుస్తుంటారు. అయితే కరోనా ఎఫెక్ట్​తో పాఠశాలలు నడవడం లేదు. కేవలం ఆన్​లైన్​ క్లాసులే నడుస్తున్నాయి. అయినప్పటికీ స్కూళ్ల దోపిడీ మాత్రం ఏ మాత్రం ఆగడం లేదు. ఇష్టారాజ్యంగా గతంలో మాదిరిగానే ఫీజులను వసూలు చేస్తున్నారు. కొన్ని కార్పొరేట్​ పాఠశాలలైతే ట్రాన్స్​పోర్ట్​ ఫీజు కూడా వసూలు చేస్తుండటం […]

ప్రజలకు చావమని సలహా ఇచ్చిన మంత్రి..!
X

ప్రైవేట్​ స్కూళ్ల ఫీజు దోపిడీ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. కార్పొరేట్ స్కూళ్ల మీద ప్రభుత్వ నియంత్రణ ఉండదు.. దీంతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ సామాన్యుల నడ్డి విరుస్తుంటారు. అయితే కరోనా ఎఫెక్ట్​తో పాఠశాలలు నడవడం లేదు. కేవలం ఆన్​లైన్​ క్లాసులే నడుస్తున్నాయి. అయినప్పటికీ స్కూళ్ల దోపిడీ మాత్రం ఏ మాత్రం ఆగడం లేదు. ఇష్టారాజ్యంగా గతంలో మాదిరిగానే ఫీజులను వసూలు చేస్తున్నారు.

కొన్ని కార్పొరేట్​ పాఠశాలలైతే ట్రాన్స్​పోర్ట్​ ఫీజు కూడా వసూలు చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం ఆన్​లైన్ క్లాసులు కాబట్టి.. స్కూళ్లలో విద్యుత్​ బిల్లులు ఉండవు, మెయింటెనెన్స్​ భారం కూడా తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ యజమాన్యాలు దోపిడీ కొనసాగిస్తున్నాయి.

మధ్యప్రదేశ్​లో ప్రైవేట్​ విద్యాసంస్థల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. దీంతో అక్కడి విద్యార్థుల తల్లిదండ్రులు కొంత కాలంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. నిన్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ గోడు వినిపించడానికి విద్యాశాఖ మంత్రి ఇందర్‌సింగ్‌ పర్మార్‌ దగ్గరకు వెళ్లారు. చాలా సేపటి అనంతరం మంత్రి వాళ్లను కలిసేందుకు ఒప్పుకున్నారు. ఇక విద్యార్థుల తల్లిదండ్రులు తమ గోడును వెళ్ళబోసుకున్నారు.

ఏడాది కాలంగా స్కూళ్లు కొనసాగడం లేదు. కేవలం ఆన్​లైన్​ క్లాసులు మాత్రమే నడుస్తున్నాయి. అయినప్పటికీ యాజమాన్యాలు ఫీజుల పేరిట వేధిస్తున్నాయంటూ తల్లిదండ్రులు వాపోయారు.
స్కూళ్లు ఈ స్థాయిలో దోపిడీ చేస్తున్నాయి.. మమ్మల్ని ఏం చేయమంటారు? చావమంటారా? అంటూ ఓ పేరేంట్​ ఆవేదన వ్యక్తం చేశాడు.

దీనికి మంత్రి.. ‘చస్తే చావండయ్యా. నన్నేం చేయమంటారు. వెళ్లి ఆందోళన చేసుకోపోండి. లేదంటే చావండి’ అంటూ మండిపడ్డారు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. మంత్రి పర్మార్​ వ్యాఖ్యల పట్ల ప్రజలు, ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు.

First Published:  1 July 2021 2:18 AM GMT
Next Story