Telugu Global
Health & Life Style

తొలిడోసు కోవిషీల్డ్​, రెండో డోసు ఫైజర్​.. ఎంతో బెస్ట్ ..! తేల్చిన ఆక్స్​ఫర్డ్​ వర్సిటీ

ప్రస్తుతం మనదేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. తొలి డోసులో ఏ వ్యాక్సిన్​ అయితే ఇస్తున్నారో? రెండో డోసులోనూ అదే వ్యాక్సిన్​ను రిపీట్​ చేస్తున్నారు. అయితే బ్రిటన్​లోని ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. అదేమిటంటే తొలిడోసు కింద కోవిషీల్డ్​, రెండో డోసు కింద ఫైజర్​ వ్యాక్సిన్​ ఇస్తే.. మెరుగైన ఫలితాలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల.. రోగ నిరోధకశక్తి ఎక్కువగా వస్తుందని చెబుతున్నారు. ఈ మేరకు సైంటిస్టులు శాస్త్రీయ ఆధారాలు […]

తొలిడోసు కోవిషీల్డ్​, రెండో డోసు ఫైజర్​.. ఎంతో బెస్ట్ ..! తేల్చిన ఆక్స్​ఫర్డ్​ వర్సిటీ
X

ప్రస్తుతం మనదేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. తొలి డోసులో ఏ వ్యాక్సిన్​ అయితే ఇస్తున్నారో? రెండో డోసులోనూ అదే వ్యాక్సిన్​ను రిపీట్​ చేస్తున్నారు. అయితే బ్రిటన్​లోని ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. అదేమిటంటే తొలిడోసు కింద కోవిషీల్డ్​, రెండో డోసు కింద ఫైజర్​ వ్యాక్సిన్​ ఇస్తే.. మెరుగైన ఫలితాలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇలా చేయడం వల్ల.. రోగ నిరోధకశక్తి ఎక్కువగా వస్తుందని చెబుతున్నారు. ఈ మేరకు సైంటిస్టులు శాస్త్రీయ ఆధారాలు చూపిస్తున్నారు. ఇటీవల మొత్తం 830 మంది మీద ఈ మేరకు ప్రయోగాలు చేశారు.
57 ఏళ్ల వయసు ఉన్నవారిని ఈ ప్రయోగానికి ఎంచుకున్నారు. ఇందులో మొదటి డోసు కోవిషీల్డ్​, రెండో డోసు ఫైజర్​ ఇచ్చిన వారిలో ఇమ్యూనిటీ ఎక్కువగా అభివృద్ధి చెందింది. అదే రెండు డోసులు కోవిషీల్డ్​ ఇచ్చిన వారి కంటే.. డోసు మార్చిన ఇచ్చిన వారిలో ఎక్కువగా రోగనిరోధకశక్తి పెరిగింది.

కోవిడ్‌ కారక సార్స్‌-కొవ్‌-2 వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌కు వ్యతిరేకంగా ఎక్కువ యాంటీబాడీలు ఉత్పన్నమవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. అయితే తొలుత ఫైజర్​ డోసు ఇచ్చి.. ఆ తర్వాత కోవిషీల్డ్​ ఇస్తే పెద్దగా ఫలితం ఉండటం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ దిశగా మరికొన్ని ప్రయోగాలు సాగాల్సి ఉందని వారు అంటున్నారు.

First Published:  1 July 2021 3:22 AM GMT
Next Story