Telugu Global
National

కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందే..!

కోవిడ్ కారణంగా మృతిచెందినవారి కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరుగుతోంది. దీనిపై తొలుత కేంద్రాన్ని ప్రశ్నించగా.. అలాంటి పరిహారం తాము ఇవ్వలేమని చేతులెత్తేసింది ప్రభుత్వం. పరిహారం ఇచ్చుకుంటూ పోతే.. వైద్య సదుపాయాలు మెరుగుపరచలేమని, థర్డ్ వేవ్ ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సరైన వైద్యం అందుబాటులోకి తీసుకు రాలేమని కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. అదే సమయంలో పరిహారం అనేది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పరిధిలో ఉంటుందని […]

కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందే..!
X

కోవిడ్ కారణంగా మృతిచెందినవారి కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరుగుతోంది. దీనిపై తొలుత కేంద్రాన్ని ప్రశ్నించగా.. అలాంటి పరిహారం తాము ఇవ్వలేమని చేతులెత్తేసింది ప్రభుత్వం. పరిహారం ఇచ్చుకుంటూ పోతే.. వైద్య సదుపాయాలు మెరుగుపరచలేమని, థర్డ్ వేవ్ ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సరైన వైద్యం అందుబాటులోకి తీసుకు రాలేమని కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. అదే సమయంలో పరిహారం అనేది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పరిధిలో ఉంటుందని చెప్పి, కేంద్రం పక్కకు తప్పుకోవాలని చూసింది. అయితే ఎక్స్ గ్రేషియా విషయంలో బాధిత కుటుంబాలకు న్యాయం చేయాల్సిందేని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

కోవిడ్ బాధిత కుటుంబాల‌కు ఎక్స్‌ గ్రేషియా ఎంత ఇవ్వాల‌న్న దానిపై మార్గ‌ద‌ర్శ‌కాలు త‌యారు చేయాల‌ని నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఎంత న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌న్న దానిపై NDMA దే తుది నిర్ణయం అని స్పష్టం చేసింది. 6 వారాల‌ వ్య‌వ‌ధిలోగా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించాల‌ని కోర్టు ఆదేశించింది.

డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ యాక్ట్‌ లోని 12వ సెక్ష‌న్ ప్ర‌కారం న‌ష్ట‌ప‌రిహారాన్ని ఫిక్స్ చేయాలని సూచించింది కోర్టు. కోవిడ్‌ తో చ‌నిపోయివారికి ఇచ్చే డెత్ స‌ర్టిఫికెట్‌ లో కారణం కూడా ఉండాలని స్పష్టం చేసింది. బాధితుల మృతి ప‌ట్ల ఏదైనా అనుమానం ఉంటే, స‌ర్టిఫికెట్‌ లో మార్పుల కోసం అవ‌కాశం క‌ల్పించాలని ప్రభుత్వానికి సూచించింది. సుప్రీం వ్యాఖ్యలతో దేశ్యాప్తంగా కోవిడ్ తో మరణించినవారి కుటుంబాలకు ఆర్థిక భరోసా దక్కబోతుందనే విషయం స్పష్టమైంది.

ఇప్పటికే ఏపీ సహా పలు ఇతర రాష్ట్రాలు కొవిడ్ తో మరణించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కి భారీ ఆర్థిక సాయం ప్రకటించాయి. కోవిడ్ కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులకు కూడా ఆర్థిక సాయం అందిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండేలా.. కేంద్రం తరపున నష్టపరిహారం అందించేలా సుప్రీంకోర్టు చొరవ తీసుకుంటోంది.

First Published:  30 Jun 2021 1:51 AM GMT
Next Story