Telugu Global
International

బరువు తగ్గేందుకు నోరు కట్టేసుకోవద్దు.. నోరు కుట్టేసుకోండి..

బరువు తగ్గించే సాధనాలు, ఉత్పాదనలు, క్లినిక్ లకు ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల మార్కెట్ ఉంది. నాజూకుదనంలోనే అందం ఉంది అనుకునేవారు, బరువు పెరిగితే ఇతర అనారోగ్య సమస్యలొస్తాయనే భయం ఉన్నవారు కృత్రిమ పద్ధతుల్లో తక్కువ వ్యవధిలో బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి ప్రయత్నాల్లో ప్రాణాలు కోల్పోయినవారు కూడా చాలామందే ఉన్నారు. అయినా కూడా వెయిట్ లాస్ ట్రీట్ మెంట్ అనే వ్యవహారం ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా సాగిపోతోంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ సైంటిస్ట్ […]

బరువు తగ్గేందుకు నోరు కట్టేసుకోవద్దు.. నోరు కుట్టేసుకోండి..
X

బరువు తగ్గించే సాధనాలు, ఉత్పాదనలు, క్లినిక్ లకు ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల మార్కెట్ ఉంది. నాజూకుదనంలోనే అందం ఉంది అనుకునేవారు, బరువు పెరిగితే ఇతర అనారోగ్య సమస్యలొస్తాయనే భయం ఉన్నవారు కృత్రిమ పద్ధతుల్లో తక్కువ వ్యవధిలో బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి ప్రయత్నాల్లో ప్రాణాలు కోల్పోయినవారు కూడా చాలామందే ఉన్నారు. అయినా కూడా వెయిట్ లాస్ ట్రీట్ మెంట్ అనే వ్యవహారం ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా సాగిపోతోంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ సైంటిస్ట్ లు కనిపెట్టిన ఓ ఉత్పాదన ఇప్పుడు ప్ర‌పంచ‌ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

దవడను కుట్టేస్తారు..
బరువు పెరగడానికి ప్రధాన కారణం అతిగా తినడం అనేది కొంతమంది అపోహ. దాన్ని ఆధారంగా చేసుకుని సాగిన పరిశోధనల ఫలితమే ఇది. అంటే మనిషి ఎక్కువ తినడానికి అవకాశం లేకుండా పై దవడ, కింది దవడను కొంతమేర కలిపి కుట్టేస్తారు. న్యూజిలాండ్ లోని ఒటాగో యూనివర్శిటీ శాస్త్రవేత్తలు, బ్రిటన్ పరిశోధకులతో కలసి ఈ పరికరాన్ని తయారు చేశారు. దంత వైద్యులు దీన్ని అమర్చాల్సి ఉంటుంది. ఇది అమర్చిన తర్వాత మన నోటిని కేవలం 2మిల్లీమీటర్లు మాత్రమే తెరవగలం. కొంతమందిపై ఆల్రడీ ప్రయోగాలు కూడా జరిగాయి. ‘జా వైరింగ్’ అనే ఈ పరికరాన్ని అమర్చుకున్నవారు వారం రోజుల్లో సగటున 6.3 కేజీలు బరువు తగ్గారని పరిశోధకులు చెబుతున్నారు.

బేరియాట్రిక్ కంటే డేంజర్..
బరువు తగ్గేందుకు ఆమధ్య బేరియాట్రిక్ సర్జరీ అనేది బాగా పాపులర్ అయింది. మనదేశంలో సినిమా నటులు, రాజకీయ నాయకులు చాలామంది ఆ సర్జరీ ద్వారా బరువు తగ్గారు. అన్నవాహిక పరిమాణాన్ని తగ్గించడం ద్వారా తక్కువ ఆహార పదార్థాలు తీసుకున్నా, కడుపు నిండిపోయిన ఫీలింగ్ కలిగించడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశం. దీనివల్ల సైడె ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయంటూ, ఇప్పుడు శాస్త్రవేత్తలు ‘జా వైరింగ్’ అనే పరికరాన్ని కనిపెట్టి నోటిలో అమరుస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటికై తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీన్ని అమర్చుకున్న కొంతమంది, ప్రశాంతంగా మాట్లాడలేకపోతున్నామని, కొన్నిసార్లు శ్వాస సమస్యలు కూడా తలెత్తాయని చెబుతున్నారు. దీన్ని ఓ ‘టార్చర్ డివైస్’ గా పేర్కొంటూ ఆన్ లైన్ లో రివ్యూలు ఉంచుతున్నారు. దీంతో న్యూజిలాండ్ శాస్త్రవేత్తల బృందం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే సదరు శాస్త్రవేత్తలు మాత్రం తమ ఆవిష్కరణ అత్యంత గొప్పది అని అంటున్నారు. ఎక్కడా ఎలాంటి ఆపరేషన్ అవసరం లేదని, జీర్ణ వ్యవస్థ పనితీరుని కృత్రిమంగా తాము కంట్రోల్ చేయడంలేదని, పర్యావరణ హిత ప్రయోగం ఇది అని సర్దిచెప్పుకుంటున్నారు.

First Published:  29 Jun 2021 8:46 PM GMT
Next Story