Telugu Global
NEWS

కృష్ణా నీటివాటా కోసం న్యాయపోరాటం.. ఏపీ కేబినెట్ తీర్మానం..

రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నది నీటిని దొంగిలించుకుపోతున్నారంటూ ఓవైపు ఆరోపణలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, మరోవైపు శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి జలవిద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని తరలించుకుపోతోందంటూ మండిపడ్డారు ఏపీ మంత్రులు. శ్రీశైలంలో తగినంత నీరు లేకపోయినా జలవిద్యుత్ పేరుతో జలచౌర్యం జరుగుతోందని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే కృష్ణానది యాజమాన్య బోర్డుకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, మరోసారి లేఖ రాయాలని కేబినెట్ తీర్మానించింది. అవసరమైతే ప్రధాని మోదీకి సైతం లేఖలు రాయాలని సీఎం […]

కృష్ణా నీటివాటా కోసం న్యాయపోరాటం.. ఏపీ కేబినెట్ తీర్మానం..
X

రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నది నీటిని దొంగిలించుకుపోతున్నారంటూ ఓవైపు ఆరోపణలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, మరోవైపు శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి జలవిద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని తరలించుకుపోతోందంటూ మండిపడ్డారు ఏపీ మంత్రులు. శ్రీశైలంలో తగినంత నీరు లేకపోయినా జలవిద్యుత్ పేరుతో జలచౌర్యం జరుగుతోందని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే కృష్ణానది యాజమాన్య బోర్డుకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, మరోసారి లేఖ రాయాలని కేబినెట్ తీర్మానించింది. అవసరమైతే ప్రధాని మోదీకి సైతం లేఖలు రాయాలని సీఎం జగన్, మంత్రులకు సూచించారు.

అనుమతి లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథక నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తోందంటూ ఇటీవల తెలంగాణ మంత్రులు కృష్ణానదీ యాజమాన్య బోర్డుకి ఫిర్యాదు చేశారు. అంతకు ముందు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా దీనిపై పిటిషన్ వేశారు. డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా పనులు కొనసాగించొద్దంటూ కృష్ణాయాజమాన్య బోర్డు ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ప్రాజెక్ట్ సందర్శనకు వస్తానని చెప్పింది. ఈ దశలో తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్ట్ లను కూడా సందర్శించాలని, అక్కడ కూడా అనుమతులు లేకుండా పలు ప్రాజెక్ట్ లు నిర్మిస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ దశలో రెండు రాష్ట్రాల మధ్య జలజగడం మొదలైంది. దీనిపై న్యాయపోరాటానికి జగన్ సర్కారు సిద్ధమని ప్రకటించింది. ఏపీ కేబినెట్ భేటీలో ఈమేరకు తీర్మానం చేసింది.

ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు..
– 9, 10, ఇంటర్ విద్యార్థులకు ల్యాప్ టాప్ ల పంపిణీకి మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్
– రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్స్‌ ల కొనుగోలుకు ఆమోదం
– నవరత్నాల్లో భాగంగా 28 లక్షల ఇళ్ల నిర్మాణానికి, భారీ ప్రచార కార్యక్రమానికి ఆమోదం.
– ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి యూనివర్శిటీ ఏర్పాటుకు ఆమోదం
– జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీని యూనివర్శిటీగా మార్చేందుకు నిర్ణయం
– టిడ్కో ద్వారా 2,62,216 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి మంత్రివర్గం ఆమోదం
– 2021-24 ఐటీ విధానానికి ఆమోదం
– ఏపీ భూహక్కు చట్ట సవరణకు ఆమోదం
– విశాఖ నక్కపల్లి వద్ద హెటిరో డ్రగ్స్‌ సెజ్‌ కు 81ఎకరాల భూమి కేటాయింపుకి ఆమోదం
– రూ.864 కోట్లతో హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా పుట్టపర్తి నియోజక వర్గానికి ఎత్తిపోతల, గ్రావిటీ ద్వారా నీటి సరఫరాకు అంగీకారం
– ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు 539 కొత్త 104-వాహనాల కొనుగోలుకు రూ.90 కోట్ల నిధులు మంజూరు

First Published:  30 Jun 2021 7:40 AM GMT
Next Story