Telugu Global
Cinema & Entertainment

ఛత్రపతి రీమేక్ కు సర్వం సిద్ధం

బెల్లంకొండ బాలీవుడ్ డెబ్యూకు సర్వం సిద్ధమైంది. నిజానికి ఈ పాటికే సినిమా సెట్స్ పైకి రావాలి. కానీ లాక్ డౌన్ వల్ల ఆగింది. ఈ గ్యాప్ లో వర్షాలకు సినిమా కోసం వేసిన సెట్ పాడైంది. ప్రస్తుతం ఆ సెట్ ను తిరిగి పునర్నిర్మించే పని జరుగుతోంది. ఆ సెట్ రెడీ అవ్వగానే షూటింగ్. తాజా సమాచారం ప్రకారం, జులై మొదటి వారం నుండి ఛత్రపతి హిందీ రీమేక్ మొదలయ్యేలా ఉంది. ముందుగా బెల్లంకొండ శ్రీనివాస్ పై […]

ఛత్రపతి రీమేక్ కు సర్వం సిద్ధం
X

బెల్లంకొండ బాలీవుడ్ డెబ్యూకు సర్వం సిద్ధమైంది. నిజానికి ఈ పాటికే సినిమా సెట్స్ పైకి రావాలి. కానీ
లాక్ డౌన్ వల్ల ఆగింది. ఈ గ్యాప్ లో వర్షాలకు సినిమా కోసం వేసిన సెట్ పాడైంది. ప్రస్తుతం ఆ సెట్ ను
తిరిగి పునర్నిర్మించే పని జరుగుతోంది. ఆ సెట్ రెడీ అవ్వగానే షూటింగ్.

తాజా సమాచారం ప్రకారం, జులై మొదటి వారం నుండి ఛత్రపతి హిందీ రీమేక్ మొదలయ్యేలా ఉంది.
ముందుగా బెల్లంకొండ శ్రీనివాస్ పై ఓ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయనున్నారని తెలుస్తుంది. దాదాపు 20
రోజుల పాటు ఈ షెడ్యుల్ జరుగుతుంది.

సినిమాకు ఇంకా పూర్తిస్థాయిలో నటీనటుల్ని ఫైనల్ చేయలేదు. సినిమాలో శ్రీనివాస్ కి హీరోయిన్ ఇంకా
కన్ఫర్మ్ అవ్వలేదు. బాలీవుడ్ నుండి హీరోయిన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారు. మరికొంతమంది
హిందీ నటులను కూడా తీసుకోనున్నారు. సినిమాలో శ్రీనివాస్ మదర్ రోల్ కి కూడా ఇంకా ఆర్టిస్ట్ ఫైనల్
అవ్వలేదు. అలాగే సినిమాలో మరో కీలకమైన తమ్ముడు క్యారెక్టర్ కూడా ఉంది. ఈ పాత్రలకు ఇంకా
నటీనటుల్ని తీసుకోలేదు.

First Published:  30 Jun 2021 9:29 AM GMT
Next Story