Telugu Global
Cinema & Entertainment

గల్లీ రౌడీ దూసుకొస్తున్నాడు

సందీప్ కిష‌న్ హీరోగా నటిస్తున్న సినిమా ‘గ‌ల్లీరౌడీ’. కోన వెంక‌ట‌న్ ఈ సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ ఇందులో ఇంపార్టెంట్ రోల్‌ను పోషించారు. కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. నేహా శెట్టి హీరోయిన్‌. చాన్నాళ్ల కిందటే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ […]

గల్లీ రౌడీ దూసుకొస్తున్నాడు
X

సందీప్ కిష‌న్ హీరోగా నటిస్తున్న సినిమా ‘గ‌ల్లీరౌడీ’. కోన వెంక‌ట‌న్ ఈ సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా
వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా
పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’
చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ ఇందులో ఇంపార్టెంట్ రోల్‌ను పోషించారు. కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ ఓ
కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. నేహా శెట్టి హీరోయిన్‌. చాన్నాళ్ల కిందటే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ
సినిమా, ఇప్పుడు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను కూడా పూర్తి చేసుకొని న్సార్‌కు సిద్ధ‌మైంది.

ఇప్ప‌టి వ‌ర‌కు సందీప్ కిష‌న్ చేయ‌న‌టువంటి డిఫ‌రెంట్ పాత్ర‌ను ‘గ‌ల్లీరౌడీ’లో చేశారు. ఇప్ప‌టికే
విడుద‌లైన టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.హీరో, హీరోయిన్ మ‌ధ్య సాగే ల‌వ్ మాంటేజ్ సాంగ్
‘పుట్టనే ప్రేమ…’కు మంచి స్పందన వచ్చింది. సినిమా ఫన్ రైడర్‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డం
ఖాయ‌మ‌ని అంటోంది యూనిట్. సెన్సార్ పూర్తి కాగానే సినిమా రిలీజ్ డేట్‌ ప్రకటిస్తారు.

First Published:  28 Jun 2021 10:23 AM GMT
Next Story