Telugu Global
National

ఇమ్యూనిటీ @15వేల కోట్ల రూపాయలు..

కరోనా కాటుకి ఎవ్వరూ మినహాయింపు కాదు. బయటకు బలంగా కనిపించేవారు చాలామంది వైరస్ దెబ్బకి మూలనపడ్డారు. పెద్ద పెద్ద బాడీబిల్డర్లు, క్రీడాకారులు సైతం కరోనా బారిన పడి విలవిల్లాడారు. అయితే బయటకు బక్కపలుచగా కనిపించే కొంతమంది మాత్రం వైరస్ ధాటిని తట్టుకుని నిలబడ్డారు. కారణం వారిలోని రోగనిరోధక శక్తి. పిల్లల్లో కూడా ఈ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ కాబట్టే, కరోనా వైరస్ వారి జోలికి వెళ్లలేదు. ఒకవేళ పిల్లలకు కరోనా సోకినా పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. శరీరంలో […]

ఇమ్యూనిటీ @15వేల కోట్ల రూపాయలు..
X

కరోనా కాటుకి ఎవ్వరూ మినహాయింపు కాదు. బయటకు బలంగా కనిపించేవారు చాలామంది వైరస్ దెబ్బకి మూలనపడ్డారు. పెద్ద పెద్ద బాడీబిల్డర్లు, క్రీడాకారులు సైతం కరోనా బారిన పడి విలవిల్లాడారు. అయితే బయటకు బక్కపలుచగా కనిపించే కొంతమంది మాత్రం వైరస్ ధాటిని తట్టుకుని నిలబడ్డారు. కారణం వారిలోని రోగనిరోధక శక్తి. పిల్లల్లో కూడా ఈ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ కాబట్టే, కరోనా వైరస్ వారి జోలికి వెళ్లలేదు. ఒకవేళ పిల్లలకు కరోనా సోకినా పెద్దగా ఇబ్బంది పెట్టలేదు.

శరీరంలో సహజంగా ఉండే రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు కరోనా కాలంలో చాలామంది ప్రయత్నాలు ప్రారంభించారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పండ్లు, డ్రైఫ్రూట్స్ వాడకం పెంచాలని వైద్యులు కూడా చెబుతూ వచ్చారు. అయితే చాలామంది విటమిన్ సప్లిమెంట్లపై ఆధారపడ్డారు. కరోనా చికిత్సలో కూడా విటమిన్ ట్యాబ్లెట్లను వైద్యులు తప్పనిసరి చేయడంతో వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత కూడా ఆ అలవాటుని చాలామంది కొనసాగించారు. ఈ విటమిన్ సప్లిమెంట్లు, ఇమ్యూనిటీ బూస్టర్లకోసం ఏడాది కాలంలో భారతీయులు ఏకంగా రూ.15వేల కోట్లు ఖర్చు చేయడం ఆసక్తికర పరిణామం.

2019 సంవత్సరంలో భారత్ లో ఇమ్యూనిటీ బూస్టర్ల మార్కెట్ రూ.5వేల కోట్లు. 2020లో దీని విలువ ఏకంగా 15వేల కోట్ల రూపాయలకు చేరింది. అంటే ఒక్కసారిగా మూడింతలైందనమాట. ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని కరోనా కాలంలో అందరికీ తెలిసొచ్చింది. దీంతో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సప్లిమెంట్లు, ఇమ్యూనిటీ బూస్టర్లకోసం భారతీయులు ఎక్కువగా ఖర్చు చేయడం మొదలు పెట్టారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆప్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెలువరించిన ఓ నివేదికలో ఈ విషయాలు బయటపడ్డాయి.

పిల్లలకోసం తయారు చేసే హెల్త్ డ్రింక్ లకు ఇప్పుడిప్పుడే భారత్ పెద్ద మార్కెట్ గా మారుతోంది. అదే సమయంలో మహిళలు, వయసు పైబడుతున్న వారికి కూడా ఇమ్యూనిటీ బూస్టర్ ట్యాబ్లెట్ల వాడకం కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో కరోనా రావడం, కరోనా ముప్పు నివారించేందుకు, శరీరంలో సహజ రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు మల్టీవిటమిన్, బి, సి, డి విటమిన్లను ట్రీట్ మెంట్ లో తప్పనిసరి చేస్తూ వైద్యులు సూచిండడంతో వీటి వాడకం పెరిగింది. దీంతో భారత్ లో వీటి మార్కెట్ 15వేల కోట్ల రూపాయలకు పెరిగింది.

First Published:  27 Jun 2021 12:42 AM GMT
Next Story