ప్రపంచ దేశాలపై డెల్టా వేరియంట్ పడగ..
భారత్ లో సెకండ్ వేవ్ రూపంలో తీవ్ర ప్రభావం చూపిన డెల్టా వేరియంట్.. ఇప్పుడు ఇతర ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ డెల్టా వేరియంట్ కేసుల పెరుగుదలతో ఇబ్బంది పడుతుండగా. తాజాగా ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, ఫిజీ, ఆఫ్రికా దేశాలు మరోసారి ఆంక్షల వలయంలోకి వెళ్తున్నాయి. మళ్లీ లాక్ డౌన్.. కరోనా వ్యాక్సినేషన్ వేగవంతంగా జరుగుతున్న ఆస్ట్రేలియాలో ఇప్పుడు డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. కరోనా వెలుగుచూసిన తర్వాత అత్యంత భయంకర పరిస్థితి ఇప్పుడే ఆస్ట్రేలియాలో చూస్తున్నామని […]
భారత్ లో సెకండ్ వేవ్ రూపంలో తీవ్ర ప్రభావం చూపిన డెల్టా వేరియంట్.. ఇప్పుడు ఇతర ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ డెల్టా వేరియంట్ కేసుల పెరుగుదలతో ఇబ్బంది పడుతుండగా. తాజాగా ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, ఫిజీ, ఆఫ్రికా దేశాలు మరోసారి ఆంక్షల వలయంలోకి వెళ్తున్నాయి.
మళ్లీ లాక్ డౌన్..
కరోనా వ్యాక్సినేషన్ వేగవంతంగా జరుగుతున్న ఆస్ట్రేలియాలో ఇప్పుడు డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. కరోనా వెలుగుచూసిన తర్వాత అత్యంత భయంకర పరిస్థితి ఇప్పుడే ఆస్ట్రేలియాలో చూస్తున్నామని అక్కడి ప్రజా ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిడ్నీలో వారం రోజులపాటు లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది.
వ్యాక్సినేషన్లో ముందున్న ఇజ్రాయెల్ కూడా రోజువారీ కేసులు పెరుగుతుండటంతో ఆందోళనకు గురవుతోంది. ఇళ్లలో మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరంలేదంటూ ఇటీవల ఆదేశ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డెల్టావేరియంట్ విజృంభిస్తుండటంతో.. ఇప్పుడు ఆ ఆదేశాల్ని వెనక్కి తీసుకుంది. ఇజ్రాయెల్ లో ఇంట్లో ఉన్నా, బయటకొచ్చినా మాస్క్ కచ్చితంగా పెట్టుకోవాల్సిందే.
ఏడాదిగా కరోనా కేసుల్లేని ఫిజీలో, డెల్టా ఎంట్రీ..
తొలినాళ్లలో కరోనా కేసులు కనిపించినా.. ఆ తర్వాత కట్టడి చర్యలతో వైరస్ కి అడ్డుకట్ట వేసింది ఫిజీ. ఏడాది కాలంగా ఫిజీలో కరోనా కేసులు లేవు. తాజాగా అక్కడ డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. ఒక్కరోజులోనే 300 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందని, అధికారులు ప్రకటించారు. ఆంక్షలు విధించారు.
ఆఫ్రికాలో థర్డ్‌వేవ్ వచ్చేసిందా..?
డెల్టా ప్లస్ వేరియంట్ తో థర్డ్ వేవ్ ముప్పు ఉంటుందని భారత్ లో ప్రచారం జరుగుతున్నవేళ, డెల్టా వేరియంట్ తోనే ఆఫ్రికాలో థర్డ్ వేవ్ ఎంట్రీ ఇచ్చిందని అక్కడి వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) తెలిపింది. ఆఫ్రికాలోని 14 దేశాల్లో డెల్టా వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉంది. మూడు వారాలుగా అక్కడ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కాంగో, ఉగాండా ప్రాంతాల్లో మరీ ఎక్కువగా కేసులు ప్రబలుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ దశలో దాన్ని వారు థర్డ్ వేవ్ గా భావిస్తున్నారు. వ్యాక్సినేషన్ జోరందుకోని ఆఫ్రికా దేశాలతోపాటు, టీకాల పంపిణీ దాదాపుగా పూర్తి చేసిన చిన్న చిన్న దేశాలు కూడా డెల్టా వేరియంట్ కోరల్లో చిక్కుకోవడం ఆందోళన కలిగించే విషయం.