Telugu Global
Health & Life Style

గర్భిణులకు కూడా కొవిడ్ టీకా.. ఐసీఎంఆర్ తాజా మార్గదర్శకాలు..

ఇటీవల బాలింతలకు కూడా కొవిడ్ టీకా వేయొచ్చని భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ సూచించిన విషయం తెలిసిందే. తాజాగా గర్భిణులకు కూడా టీకా వేయొచ్చని ఐసీఎంఆర్ తెలిపింది. భారత్ లో వ్యాక్సినేషన్ మొదలైన తర్వాత కేవలం వయోజనులకు మాత్రమే టీకాలు ఇస్తూ వచ్చారు. గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిని తొలిదశలో మినహాయించారు. అయితే ఆ తర్వాతి రోజుల్లో ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం 18ఏళ్లపైబడినవారంతా టీకాలు తీసుకుంటున్నారు. గర్భిణులు, బాలింతల విషయంలో మాత్రం పూర్తి […]

గర్భిణులకు కూడా కొవిడ్ టీకా.. ఐసీఎంఆర్ తాజా మార్గదర్శకాలు..
X

ఇటీవల బాలింతలకు కూడా కొవిడ్ టీకా వేయొచ్చని భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ సూచించిన విషయం తెలిసిందే. తాజాగా గర్భిణులకు కూడా టీకా వేయొచ్చని ఐసీఎంఆర్ తెలిపింది. భారత్ లో వ్యాక్సినేషన్ మొదలైన తర్వాత కేవలం వయోజనులకు మాత్రమే టీకాలు ఇస్తూ వచ్చారు. గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిని తొలిదశలో మినహాయించారు. అయితే ఆ తర్వాతి రోజుల్లో ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం 18ఏళ్లపైబడినవారంతా టీకాలు తీసుకుంటున్నారు. గర్భిణులు, బాలింతల విషయంలో మాత్రం పూర్తి స్థాయి పరిశోధనలు చేసిన తర్వాతే ఐసీఎంఆర్ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం గర్భిణులు కూడా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

పిల్ల విషయంలో సాలోచన..
థర్డ్ వేవ్ ముప్పు పిల్లలకు ఎక్కువగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలో చిన్న పిల్లల టీకాలపై భారత్ లో అధ్యయనాలు జరుగుతున్నాయి. ఢిల్లీ సహా పలు చోట్ల పరిశోధనల్లో భాగంగా చిన్నారులకు టీకాలు ఇస్తున్నారు. ఈ పరిశోధన ఫలితాలు వెలువడిన తర్వాత అధికారికంగా చిన్నారుల టీకాపై ప్రకటన వెలువడుతుంది. ప్రస్తుతం అమెరికాలో మాత్రమే పిల్లలకు టీకాలు వేస్తున్నారని చెప్పారు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ. బాగా చిన్న పిల్లలకు వ్యాక్సిన్‌ అవసరమా.. లేదా.. అనే అంశం ఇప్పటికీ ప్రశ్నగానే ఉందని చెప్పారు. భారత్ లో 2-18 ఏండ్ల పిల్లలకు వ్యాక్సిన్‌పై పరిశోధనలు జరుగుతున్నాయని, సెప్టెంబర్‌-అక్టోబర్‌ లో ఫలితాలు రావొచ్చని చెప్పారు.

డెల్టాప్లస్ ని వ్యాక్సిన్ ఎదుర్కొంటుందా..?
ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లపై కొవాక్సిన్‌, కొవిషీల్డ్‌ లు సమర్థంగా పనిచేస్తున్నాయని డాక్టర్‌ బలరాం భార్గవ చెప్పారు. కొత్తగా వెలుగుచూసిన డెల్టా ప్లస్‌ వేరియంట్ పై ఈ రెండు వ్యాక్సిన్లు ఎంతమేరకు పనిచేస్తున్నాయనేది పరిశీలిస్తున్నామని, వారం, పదిరోజుల్లో ఆ విషయం కూడా తేలిపోతుందని చెప్పారు. భారత్‌ లో ప్రస్తుతం పది రాష్ర్టాలలో 48 డెల్టాప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయని అన్నారు బలరాం భార్గవ. దేశంలో సెకండ్‌ వేవ్‌ ఇంకా ముగిసిపోలేదని చెప్పిన భార్గవ.. కరోనా మార్గదర్శకాలను అందరూ విధిగా పాటించాలని సూచించారు.

First Published:  26 Jun 2021 12:17 AM GMT
Next Story