Telugu Global
Cinema & Entertainment

"ఆహా"లో అమలాపాల్ షో

అల్లు అరవింద్ కు చెందిన ఆహాలో మరో సిరీస్ రెడీ అవుతోంది.. అమ‌లాపాల్‌, రాహుల్ విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇండియాలో డిజిట‌ల్ మాధ్య‌మం ద్వారా ప్ర‌సార‌మ‌వుతున్న తొలి సైంటిఫిక‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్ సిరీస్ ఇది. రామ్ విఘ్నేశ్ రూపొందించిన ఈ సిరీస్‌ను లూసియా, యూ ట‌ర్న్ వంటి సూప‌ర్ హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్ తెర‌కెక్కించారు. ఈ సిరీస్ మోష‌న్ పోస్ట‌ర్‌ను శ‌నివారం విడుద‌ల చేశారు. ఈ మోష‌న్ పోస్ట‌ర్ చూపించిన‌ట్లు గోడ‌పై అతికించిన […]

ఆహాలో అమలాపాల్ షో
X

అల్లు అరవింద్ కు చెందిన ఆహాలో మరో సిరీస్ రెడీ అవుతోంది.. అమ‌లాపాల్‌, రాహుల్ విజ‌య్ ప్ర‌ధాన
పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇండియాలో డిజిట‌ల్ మాధ్య‌మం ద్వారా ప్ర‌సార‌మ‌వుతున్న తొలి సైంటిఫిక‌ల్
క్రైమ్ థ్రిల్ల‌ర్ సిరీస్ ఇది. రామ్ విఘ్నేశ్ రూపొందించిన ఈ సిరీస్‌ను లూసియా, యూ ట‌ర్న్ వంటి సూప‌ర్
హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్ తెర‌కెక్కించారు. ఈ సిరీస్ మోష‌న్ పోస్ట‌ర్‌ను శ‌నివారం విడుద‌ల
చేశారు.

ఈ మోష‌న్ పోస్ట‌ర్ చూపించిన‌ట్లు గోడ‌పై అతికించిన నోటీసులు, గ‌న్‌, గ‌డియారం వంటి విజువ‌ల్స్
ప్రేక్ష‌కుల్లో ఓ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇందులో అమ‌లాపాల్, విజ్ఞ‌త లేని క్రూర‌మైన పోలీస్ ఆఫీస‌ర్‌గా
క‌నిపిస్తుంటే..రాహుల్ విజ‌య్ డెలివ‌రీ బాయ్ పాత్ర‌లో క‌నిపించాడు. భిన్న‌మైన రంగాల‌కు చెందిన ఇద్ద‌రు
వ్య‌క్తుల‌ను జీవితం ఎలా క‌లిపింది? సైంటిఫిక్ అంశాలు ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్‌లో ఎలా వ‌చ్చాయి? అనేది ఈ
స్టోరీ.

ఆమె, నాయ‌క్‌, ఇద్ద‌ర‌మ్మాయిల‌తో, ల‌వ్ ఫెయిల్యూర్ వంటి వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టించి న‌టిగా త‌న
ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న అమ‌ల‌పాల్‌కు యూత్‌లో మంచి ఆద‌ర‌ణ ఉన్న రాహుల్ విజ‌య్ వంటి యాక్ట‌ర్
తోడు కావ‌టం మంచి సామ‌ర్థాన్ని పెంచింది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తోన్న ఈ సిరీస్‌లో ప్రేక్ష‌కుల‌కు
మ‌రిన్ని స‌ర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఎదురుకానున్నాయి.

First Published:  26 Jun 2021 8:08 AM GMT
Next Story