Telugu Global
Cinema & Entertainment

నటనకు తలైవా గుడ్ బై..?

నిజంగా ఇది సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు షాకింగ్ వార్తే. త్వరలో రజనీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు కోలీవుడ్ సమాచారం. ప్రస్తుతం ఆయన శివ దర్శకత్వంలో అన్నాత్తే అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి రజినీకాంత్ తనకు సంబంధించిన టాకీ పార్ట్ ను పూర్తి చేసుకున్నాడు. డబ్బింగ్ కూడా ఫినిష్ చేశాడు. కాగా రజినీకాంత్ ఇటీవల తన భార్య లత, కుమార్తె సౌందర్యతో కలసి వైద్య చికిత్స ల కోసం అమెరికాకు […]

నటనకు తలైవా గుడ్ బై..?
X

నిజంగా ఇది సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు షాకింగ్ వార్తే. త్వరలో రజనీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు కోలీవుడ్ సమాచారం. ప్రస్తుతం ఆయన శివ దర్శకత్వంలో అన్నాత్తే అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి రజినీకాంత్ తనకు సంబంధించిన టాకీ పార్ట్ ను పూర్తి చేసుకున్నాడు. డబ్బింగ్ కూడా ఫినిష్ చేశాడు. కాగా రజినీకాంత్ ఇటీవల తన భార్య లత, కుమార్తె సౌందర్యతో కలసి వైద్య చికిత్స ల కోసం అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే.

రజినీకాంత్ అల్లుడు ధనుష్ హాలీవుడ్ సినిమా షూటింగ్ లో భాగంగా ప్రస్తుతం అమెరికా లోనే ఉంటున్నాడు. రజినీ కుమార్తె ఐశ్వర్య కూడా అక్కడే ఉంది. రజిని ఫ్యామిలీతో కలిసి అక్కడికే వెళ్ళినట్లు సమాచారం.పదేళ్ళ కిందట రజినీకాంత్ కు సింగపూర్ లో కిడ్నీ మార్పిడి చికిత్స జరిగింది. ఆ తర్వాత ఆయన అమెరికాలో పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కిడ్నీ మార్పిడి చేయించుకుని పదేళ్లు దాటడంతో మరోసారి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు రజనీకాంత్ అమెరికా వెళ్ళినట్లు సమాచారం.

అక్కడ ఆయన పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యుల సూచనల మేరకు ఇకపై సినిమాలు చేయాలా.. వద్దా..అనే విషయమై నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. కొన్ని నెలల కిందట తమిళనాడులో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు రజనీకాంత్ కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా ఆయన పార్టీ పెడుతున్నట్లు చేసిన ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. ఆరోగ్య కారణాలతోనే ఆయన కొత్త పార్టీ ప్రారంభించ లేకపోయారనే వార్తలు అప్పట్లో వచ్చాయి.

ఇప్పుడు రజినీకాంత్ వైద్య చికిత్స కోసం అమెరికాకు వెళ్లడంతో ఈ వార్తల్లో నిజం ఉందని తెలుస్తోంది. వైద్యులు తెలిపే సూచనల మేరకు సినిమాల్లో కూడా కొనసాగాలా..వద్దా.. అనే విషయమై రజనీకాంత్ నిర్ణయం తీసుకోనున్నారని టాక్. నిజంగా ఇది దేశవ్యాప్తంగా ఉన్న రజిని అభిమానులకు షాకింగ్ వార్తే.

First Published:  25 Jun 2021 2:25 AM GMT
Next Story