Telugu Global
National

మూడోదశ ప్రభావం తక్కువే.. ఐఐటీ కాన్పూర్ పరిశోధన..

కరోనా ఫస్ట్ వేవ్ కంటే, సెకండ్ వేవ్ ప్రభావం బాగా ఎక్కువ. అదే రీతిలో థర్డ్ వేవ్ వస్తే, దాని ప్రభావం మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కానీ థర్డ్ వేవ్ తో పెద్దగా ముప్పు ఉండకపోవచ్చని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్లు చేసిన అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్తంగా అన్ లాక్ ప్రక్రియ పూర్తిగా అమలులోకి వస్తే, మూడో దశ గరిష్టాన్ని తాకే సంభావ్యతను ఈ బృందం లెక్కగట్టింది. ఎలా చూసినా.. థర్డ్ వేవ్ ముప్పు పెద్దగా […]

మూడోదశ ప్రభావం తక్కువే.. ఐఐటీ కాన్పూర్ పరిశోధన..
X

కరోనా ఫస్ట్ వేవ్ కంటే, సెకండ్ వేవ్ ప్రభావం బాగా ఎక్కువ. అదే రీతిలో థర్డ్ వేవ్ వస్తే, దాని ప్రభావం మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కానీ థర్డ్ వేవ్ తో పెద్దగా ముప్పు ఉండకపోవచ్చని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్లు చేసిన అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్తంగా అన్ లాక్ ప్రక్రియ పూర్తిగా అమలులోకి వస్తే, మూడో దశ గరిష్టాన్ని తాకే సంభావ్యతను ఈ బృందం లెక్కగట్టింది. ఎలా చూసినా.. థర్డ్ వేవ్ ముప్పు పెద్దగా ఉండకపోవచ్చని వీరు తేల్చి చెబుతున్నారు. ఎస్ఐఆర్ మోడల్ ఆధారంగా మూడో దశను వీరు అంచనా వేశారు.

సెకండ్ వేవ్ విషయంలో కూడా కాన్పూర్ ప్రొఫెసర్లు చేసిన అధ్యయనం దాదాపుగా వాస్తవాలతో సరిపోలింది. ప్రస్తుతం మూడో దశ గురించి నిపుణుల అంచనా ఎలా ఉందంటే..?
– సెప్టెంబర్-అక్టోబర్ మధ్య కాలంలో మూడో దశ గరిష్టానికి చేరుకుంటుంది.
– రెండో దశకంటే మూడోదేశ ప్రభావం తక్కువగా ఉంటుంది.
– వైరస్‌ ఉత్పరివర్తనాల ప్రభావం తక్కువగా ఉంటుంది.
– వైరస్‌ వ్యాప్తి రెండో దశ గరిష్టం కంటే ఎక్కువగా ఉంటే, సెప్టెంబర్ నాటికే మూడో దశ గరిష్టాన్ని అందుకుంటుంది.
– భౌతిక దూరం, మాస్క్ వాడకం, కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తే మూడో దశ ప్రభావం మరింత తక్కువగా ఉంటుంది.
– వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత జోరుగా సాగితే.. కేసుల సంఖ్య కనిష్టంగా ఉండే అవకాశం ఉంది.

ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం, మణిపూర్, సిక్కిం మినహా దేశంలో రెండో దశ పూర్తిగా క్షీణించిందని ఐఐటీ నిపుణుల బృందం తేల్చింది. ప్రస్తుతం కేరళ, గోవా, మేఘాలయ రాష్ట్రాల్లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా ఉంది. మిగతా రాష్ట్రాల్లో 5 శాతం కంటే తక్కువకు పడిపోయింది. అన్ లాక్ ఆల్రడీ మొదలైపోయింది. జనసంచారం సాధారణ స్థాయికి చేరుకుంటోంది. ఈ దశలో థర్డ్ వేవ్ ప్రభావాన్ని పూర్తిగా కొట్టివేయలేం కానీ, ముప్పు తక్కువగా ఉంటుందనే వార్తలు మాత్రం కాస్త ఊరటనిస్తున్నాయి.

First Published:  23 Jun 2021 12:07 AM GMT
Next Story