Telugu Global
CRIME

ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో భారీ స్కామ్.. పోలీసుల అదుపులో డైరెక్టర్లు

మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో నిధుల గోల్ మాల్ వ్యవహారం రచ్చకెక్కింది. నలుగురు డైరెక్టర్లు సహా ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్, అకౌంట్ విభాగాలను పర్యవేక్షించే చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఈ వ్యవహారంపై కేసు నమోదైంది. విదేశాల్లో వైద్యులుగా స్థిరపడిన గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన ఎన్ఆర్ఐలు ఓ సొసైటీని ఏర్పాటు చేసి ఈ ఆస్పత్రి సేవలు ప్రారంభించారు. చినకాకానిలో ఉన్న ఈ ఆస్పత్రి, ఆ తర్వాతి కాలంలో […]

ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో భారీ స్కామ్.. పోలీసుల అదుపులో డైరెక్టర్లు
X

మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో నిధుల గోల్ మాల్ వ్యవహారం రచ్చకెక్కింది. నలుగురు డైరెక్టర్లు సహా ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్, అకౌంట్ విభాగాలను పర్యవేక్షించే చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఈ వ్యవహారంపై కేసు నమోదైంది.

విదేశాల్లో వైద్యులుగా స్థిరపడిన గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన ఎన్ఆర్ఐలు ఓ సొసైటీని ఏర్పాటు చేసి ఈ ఆస్పత్రి సేవలు ప్రారంభించారు. చినకాకానిలో ఉన్న ఈ ఆస్పత్రి, ఆ తర్వాతి కాలంలో మెడికల్ కాలేజీగా రూపాంతరం చెందింది. 250 ఎంబీబీఎస్,150 పీజీ సీట్లున్నఈ మెడికల్ కాలేజీ కమ్ ఆస్పత్రికి ఏపీలో మంచి పేరుంది. వివిధ దేశాలనుంచి స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఇక్కడ విజిటింగ్ డాక్టర్స్ గా సేవలందిస్తుంటారు. అయితే ఈ క్రమంలో ఇటీవల ఎన్ఆర్ఐ సొసైటీ నిధులు దారి మళ్లాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రి డైరెక్టర్లు రెండు వర్గాలుగా విడిపోయారని తెలుస్తోంది.

ఎన్ఆర్ఐ ఆస్పత్రి నిధులు దారి మళ్లించిన కొంతమంది వాటిని విదేశాలకు తరలించారని, విజయవాడలో మరో ఆస్పత్రి నిర్మిస్తున్నారని కూడా తెలుస్తోంది. అంతర్గత విభేదాలు, ఆర్థిక లావాదేవీల్లో విభేదాలు చాలా కాలంగా ఉన్నా.. ఇటీవల రచ్చకెక్కాయి. కొవిడ్ సమయంలో, అంతకు ముందు ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రికి వచ్చిన ఆదాయ విషయంలో, రోజువారీ రాబడి, ఖర్చుల అకౌంట్స్ సంబంధించిన అంశాలు కూడా వివాదానికి కారణంగా తెలుస్తోంది. రికార్డులో చూపని వందలకోట్ల రూపాయల లావాదేవీల విషయంలో చీఫ్ కోఆర్డినేటర్ ఆఫీసర్ శ్రీనివాస్ తో పాటు అదే విభాగంలో పనిచేస్తున్న మరో ఇద్దరిపై కేసు నమోదైంది.

ఎన్ఆర్ఐ ఆస్పత్రి కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. వందల కోట్ల రూపాయలు గోల్ మాల్ కావడమే కాకుండా..
కీలకమైన అడ్మినిస్ట్రేటివ్ రికార్డులు కూడా ప్రస్తుత యాజమాన్యంలోని కొందరు వ్యక్తులు దగ్ధం చేయడం విశేషం. దీంతో కేసుని పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే నిధుల గోల్ మాల్ జరిగిందని, దాన్ని కప్పి పుచ్చుకోడానికి కంప్యూటర్ రికార్డులు మాయం చేయడం, మాన్యువల్ రికార్డులు తగలబెట్టడం కూడా చేశారని అర్థమవుతోంది.

First Published:  23 Jun 2021 9:32 AM GMT
Next Story