Telugu Global
Cinema & Entertainment

మహేష్ ఫ్యామిలీ నుంచి "హీరో" వచ్చాడు

సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, మహేశ్‌బాబు మేనల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ జయదేవ్‌ గల్లా తనయుడు అశోక్‌ గల్లా హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అమరరాజ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు ‘హీరో’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేసింది చిత్ర యూనిట్‌. `హీరో` మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ […]

మహేష్ ఫ్యామిలీ నుంచి హీరో వచ్చాడు
X

సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, మహేశ్‌బాబు మేనల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ జయదేవ్‌ గల్లా తనయుడు
అశోక్‌ గల్లా హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కిస్తున్న
ఈ చిత్రాన్ని అమరరాజ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు ‘హీరో’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేసింది చిత్ర యూనిట్‌.

'హీరో' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. ఈ
సంద‌ర్భంగా హీరోగా పరిచయమవుతున్న తన మేనల్లుడు అశోక్ కు ఆల్ ద బెస్ట్ చెప్పాడు మహేష్.

'హీరో' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో ఫిట్‌ అండ్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు అశోక్ గల్లా, అలాగే ఫస్ట్
లుక్ పోస్టర్ లో కనిపిస్తున్న స్టార్ సింబల్, గన్ను, బుల్లెట్ మ‌రియు ఫిలిం రోల్ సినిమాపై మరింత ఆసక్తిని
క్రియేట్ చేసేలా ఉన్నాయి. ఇవన్నీ గతంలో మహేష్ బాబు నటించిన టక్కరి దొంగ నుంచి స్ఫూర్తిగా
తీసుకున్నారు.

అశోక్ కౌబాయ్ గా ఎంట్రీ ఇస్తున్న విజువల్స్ తో 'హీరో' సినిమా టైటిల్ టీజర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. అలాగే ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ మేజర్ హైలైట్ గా నిలవనుంద‌ని తెలుస్తోంది. వెంట‌నే ఈ యంగ్ హీరో జోక‌ర్ గెట‌ప్‌లో క‌నిపించి అందర్నీ ఆశ్య‌ర్య‌పరిచారు. అలాగే అశోక్ హీరోయిన్ నిధి అగర్వాల్ మధ్య వచ్చే లవ్ స్టోరీ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య.

First Published:  23 Jun 2021 7:11 AM GMT
Next Story