Telugu Global
International

వచ్చేస్తోంది విండోస్ 11

విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో సూపర్ హిట్‌గా పాపులర్ అయిన విండోస్ 10 వెర్షన్ ఇప్పుడు అప్‌డేట్ కాబోతోంది. త్వరలోనే విండోస్ 11 రాబోతున్నట్టు మైక్రోసాఫ్ట్ చెప్తోంది. ఇప్పటికే విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ పై మైక్రోసాఫ్ట్ తెగ పనిచేస్తోంది. అయితే ఈ నెలాఖరు లోపు కొత్త ఓఎస్ మనల్ని పలకరించే అవకాశం కనిపిస్తోంది. మైక్రోసాఫ్ట్ నుంచి విండోస్ 98, విండోస్ ఎక్స్‌పీ, విండోస్ 7, విండోస్ 10 అత్యంత సక్సెస్‌ఫుల్ వెర్షన్స్‌గా నిలవగా, విండోస్ విస్టా, విండోస్ […]

వచ్చేస్తోంది విండోస్ 11
X

విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో సూపర్ హిట్‌గా పాపులర్ అయిన విండోస్ 10 వెర్షన్ ఇప్పుడు అప్‌డేట్ కాబోతోంది. త్వరలోనే విండోస్ 11 రాబోతున్నట్టు మైక్రోసాఫ్ట్ చెప్తోంది.

ఇప్పటికే విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ పై మైక్రోసాఫ్ట్ తెగ పనిచేస్తోంది. అయితే ఈ నెలాఖరు లోపు కొత్త ఓఎస్ మనల్ని పలకరించే అవకాశం కనిపిస్తోంది. మైక్రోసాఫ్ట్ నుంచి విండోస్ 98, విండోస్ ఎక్స్‌పీ, విండోస్ 7, విండోస్ 10 అత్యంత సక్సెస్‌ఫుల్ వెర్షన్స్‌గా నిలవగా, విండోస్ విస్టా, విండోస్ 8 వెర్షన్లు యూజర్లను నిరాశ పరిచాయి. ఇప్పుడు రాబోతున్న విండోస్ 11 ఓఎస్ ఏ మేరకు ఆకర్షిస్తుందో చూడాలి.

2015లో రిలీజ్ అయిన విండోస్-10 అప్పటి నుంచి ఇప్పటి వరకూ సూపర్ సక్సెస్ ఫుల్ ఓఎస్ గా నిలిచింది. అయితే ఇప్పుడు రాబోతున్న విండోస్11 కొత్త ఓఎస్ మరింత అప్‌డేట్స్ తో రాబోతుంది. ఇందులో కొత్త స్టార్ట్ మెనూ, టాస్క్‌బార్ లే అవుట్, చిహ్నాలు, శబ్దాలు, డిజైన్స్ అండ్ ఫ్లూయిడ్ యానిమేషన్లు.. ఇలా అన్నీ కొత్తగా ఉండబోతున్నాయి.

విండోస్ 11 ఓఎస్ కి సంబంధించిన ఫీచర్లు ఎలా ఉంటాయి అనేదానిపై ఇప్పటికే చాలా లీక్ లు వచ్చాయి. అయితే ఈ నెల 24 న జరిగే మైక్రోసాఫ్ట్ విండోస్ ఈవెంట్‌లో ఈ వివరాలు తెలిసే అవకాశం ఉంది.
విండోస్ 11 ఓఎస్ రిలీజ్ అయితే విండోస్ యూజర్లు 10 నుంచి 11 కు అప్‌డేట్ అవ్వాల్సి ఉంటుంది. 2025 నాటికి విండోస్ 10 సపోర్ట్ ను పూర్తిగా ముగించనున్నట్లు ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు

First Published:  22 Jun 2021 3:32 AM GMT
Next Story