Telugu Global
Health & Life Style

ఆనందయ్య చుక్కల మందు కంటికి ప్రమాదం.. హైకోర్టుకు తెలిపిన ఏపీ సర్కారు..!

ఆనందయ్య తయారుచేసిన కంట్లో వేసే చుక్కల మందు హానికరమని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఏపీలో ఇప్పటికే ఆనందయ్య మందు పంపిణీకి అనుమతి లభించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం మందు పంపిణీకి అనుమతి ఇచ్చింది. అయితే కంట్లో వేసుకొనే చుక్కల మందుపై మాత్రం సందిగ్ధత నెలకొన్నది. ఆనందయ్య చుక్కల మందుపై ఎల్వీ ప్రసాద్​ కంటిఆస్పత్రి, శంకర నేత్రాలయ ఆస్పత్రి పరిశోధనలు సాగించాయి. ఆనందయ్య తయారుచేసిన చుక్కల మందులో హానికరమైన పదార్థాలు ఉన్నట్టు సదరు సంస్థలు తేల్చిచెప్పాయి. […]

ఆనందయ్య చుక్కల మందు కంటికి ప్రమాదం.. హైకోర్టుకు తెలిపిన ఏపీ సర్కారు..!
X

ఆనందయ్య తయారుచేసిన కంట్లో వేసే చుక్కల మందు హానికరమని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఏపీలో ఇప్పటికే ఆనందయ్య మందు పంపిణీకి అనుమతి లభించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం మందు పంపిణీకి అనుమతి ఇచ్చింది. అయితే కంట్లో వేసుకొనే చుక్కల మందుపై మాత్రం సందిగ్ధత నెలకొన్నది. ఆనందయ్య చుక్కల మందుపై ఎల్వీ ప్రసాద్​ కంటిఆస్పత్రి, శంకర నేత్రాలయ ఆస్పత్రి పరిశోధనలు సాగించాయి. ఆనందయ్య తయారుచేసిన చుక్కల మందులో హానికరమైన పదార్థాలు ఉన్నట్టు సదరు సంస్థలు తేల్చిచెప్పాయి. ఈ మేరకు ప్రభుత్వ తరఫు న్యాయవాది చింతల సుమన్​ హైకోర్టుకు తెలిపారు.

ఆనందయ్య కరోనా కోసం మొత్తం ఐదు రకాల మందులను తయారుచేశారు. ఇప్పటికే నాలుగు రకాల మందుల పంపిణీకి అనుమతి లభించింది. అయితే కంట్లో వేసే మందుకు మాత్రం అనుమతి రాలేదు. ఈ మందు అనుమతిపై కోర్టులో విచారణ జరుగుతోంది. తాజాగా హైకోర్టులో ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ.. నిపుణుల నివేదికను కోర్టుకు సమర్పించారు.

మరోవైపు ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్​ అశ్వినీకుమార్​ వాదిస్తూ.. కంట్లో వేసుకొనే మందుతో ఎటువంటి ప్రమాదం లేదని.. ఇప్పటికే తిరుపతి వెంకటేశ్వర ఆయుర్వేద విద్యాలయం చెప్పిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి కంట్లో వేసే మందుకు కూడా అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను జూలై 1కి వాయిదా వేసింది.

మరోవైపు ఆనందయ్య తయారుచేసిన మందు పంపిణీ ఏపీలోని కొన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతున్నది. ముందుగా ఆనందయ్య సొంత నియోజకవర్గంలో పంపిణీ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి, తంబళ్లపల్లె ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్​ రెడ్డి, ద్వారకనాథ రెడ్డి చొరవతో వారి వారి నియోజకవర్గాల్లోనూ మందు పంపిణీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కేవలం 4 రకాల మందులకు మాత్రమే అనుమతి ఇచ్చారు.

First Published:  22 Jun 2021 4:15 AM GMT
Next Story