'కిరాతకం'గా మారిన హీరో
హీరో ఆది సాయికుమార్, దర్శకుడు వీరభద్రం చౌదరి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విజన్ సినిమాస్ పతాకంపై వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి `కిరాతక` అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను కన్ఫర్మ్ చేసింది చిత్ర యూనిట్. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ మూవీలో ఆది సాయికుమార్ సరసన హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పూత్ నటిస్తోంది. గతంలో వీరభద్రం చౌదరి, ఆది […]

హీరో ఆది సాయికుమార్, దర్శకుడు వీరభద్రం చౌదరి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి
తెలిసిందే. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విజన్ సినిమాస్ పతాకంపై
వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'కిరాతక' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను కన్ఫర్మ్
చేసింది చిత్ర యూనిట్. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ మూవీలో ఆది సాయికుమార్
సరసన హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పూత్ నటిస్తోంది.
గతంలో వీరభద్రం చౌదరి, ఆది సాయికుమార్ కాంబినేషన్ లో చుట్టాలబ్బాయ్ అనే సినిమా వచ్చింది. ఆ
సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు వీళ్లిద్దరూ కలిసి కిరాతక అనే సినిమా చేస్తున్నారు.
ఈసారి వీరభద్రం చౌదరి తన పంథా మార్చుకొని క్రైమ్-థ్రిల్లర్ కాన్సెప్ట్ సెలక్ట్ చేసుకున్నాడు.
టాలీవుడ్ లో షూటింగ్స్ మొదలవ్వడంతో కిరాతకను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు
ప్రయత్నిస్తున్నారు. అయితే హీరోయిన్ పాయల్, ఓ పంజాబీ సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉంది. ఆమె
కాల్షీట్లన్నీ సర్దుబాటు అయ్యాక సినిమా సెట్స్ పైకి వస్తుంది. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీత
దర్శకుడు.