Telugu Global
National

బీహార్ లో తేలని లెక్కలు.. ఇంకా దాచిపెడుతున్న నిజాలు..

బీహార్ లో కరోనా మరణాలను దాచిపెట్టడంపై గతంలో పాట్నా హైకోర్టు సీరియస్ అవడంతో హడావిడిగా లెక్కలు సరిచేసింది ప్రభుత్వం. దీంతో ఏకంగా 73శాతం మరణాల సంఖ్య ఎగబాకింది. ఓ దశలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నా, మరణాల సంఖ్య పెరగడానికి బీహార్ సవరింపులే కారణం అయ్యాయి. అయితే ఇప్పుడు మరోసారి కరోనా మరణాల విషయంలో బీహార్ టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది. ఇంకా అక్కడ అనుమానాస్పద మరణాలకు లెక్క తేలడంలేదు. దీంతో మరోసారి పాట్నా […]

బీహార్ లో తేలని లెక్కలు.. ఇంకా దాచిపెడుతున్న నిజాలు..
X

బీహార్ లో కరోనా మరణాలను దాచిపెట్టడంపై గతంలో పాట్నా హైకోర్టు సీరియస్ అవడంతో హడావిడిగా లెక్కలు సరిచేసింది ప్రభుత్వం. దీంతో ఏకంగా 73శాతం మరణాల సంఖ్య ఎగబాకింది. ఓ దశలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నా, మరణాల సంఖ్య పెరగడానికి బీహార్ సవరింపులే కారణం అయ్యాయి. అయితే ఇప్పుడు మరోసారి కరోనా మరణాల విషయంలో బీహార్ టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది. ఇంకా అక్కడ అనుమానాస్పద మరణాలకు లెక్క తేలడంలేదు. దీంతో మరోసారి పాట్నా హైకోర్టు బీహార్ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది.

కరోనాతో ఇంటివద్దే చనిపోతున్నవారి వివరాలు ప్రభుత్వ కరోనా లెక్కల్లోకి ఎక్కడంలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు, లేదా మరణించిన తర్వాత ఆస్పత్రికి వచ్చే కేసుల విషయంలో కూడా కరోనాని నిర్థారణ చేయడంలేదు. దీంతో అవన్నీ సహజ మరణాల లెక్కలోకి వెళ్తున్నాయి, లేదా అనుమానాస్పద మరణాలు అని వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి మే నెల వ‌ర‌కు 2.2ల‌క్ష‌ల మంది బీహార్ లో మరణించినట్టు అధికారిక సమాచారం. ఇందులో 75 వేల‌కు పైగా మ‌ర‌ణాలకు కాజ్ ఆఫ్ డెత్ తెలియదు. అనుమానాస్పద మరణాలుగా వీటిని పరిగణిస్తున్నారు.

బీహార్ ప్రభుత్వ సివిల్‌ రిజిస్ట్రేషన్‌ విభాగం లెక్కల ప్రకారం 2019 జనవరి-మే మధ్యలో 1.3లక్షల మంది కన్నుమూశారు. అదే 2021 జనవరి-మే మధ్యలో 2.2లక్షల మంది మరణించారు. ఆ లెక్క ప్రకారం 82,500 అదనపు మరణాలు చోటు చేసుకొన్నాయి. వీటిల్లో కరోనా మరణాల సంఖ్య తీసేసినా ఇంకా దాదాపు 75వేల మరణాల లెక్క తేలడంలేదు. బీహార్‌లో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాతో 7,717 మంది మృతి చెందారు. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన అధికారిక క‌రోనా మ‌ర‌ణాల‌కు 10 రెట్లు ఎక్కువ‌గా అనుమానాస్ప‌ద మ‌ర‌ణాలు ఉన్నాయి. వీటి సంగ‌తేంటో తేల్చాల‌ని తాజాగా మరోసారి పాట్నా హైకోర్ట్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, ఢిల్లీ, కర్నాటక రాష్ట్రాల్లో కూడా అనుమానాస్పద మరణాల సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఈ అనుమానాస్ప‌ద మరణాలన్నీ క‌రోనా మ‌ర‌ణాలేనా లేదంటే వేర్వేరు కార‌ణాల వ‌ల్ల సంభ‌వించిన‌వా అనేది తేలాల్సి ఉంది.

First Published:  20 Jun 2021 7:43 AM GMT
Next Story